»   »  అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదేనా?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జులాయి' లాంటి హిట్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్ గా జరిగింది. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'కవచం' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

'కవచం' టైటిల్ గతంలోనూ వార్తల్లో వినిపించింది. రానా హీరోగా అందాల రాక్షసి ఫేం హ‌ను రాఘ‌వ పూడి ఓ సినిమా చేస్తున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది కానీ...అది నిజరూపం దాల్చలేదు. ఇపుడు బన్నీ-త్రివిక్రమ్ మూవీకి మళ్లీ ఆ టైటిల్ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలో సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌.

 Allu Arjun-Trivikram new film title 'Kavacham'

సినిమా లాంఛనంగా ప్రారంభం అయినప్పటికీ ఈ ప్రాజెక్టు ఇపుడప్పుడు పట్టాలెక్కే పరిస్థితి లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్టును విషయాలను పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'గోపాలా గోపాలా' సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో బిజీ అయిపోయాడట.

ఈ పరిణామాల నేపథ్యంలో త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమా చాలా లేటయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పరిస్థితి అర్థం చేసుకున్న అల్లు అర్జున్ కూడా టైం వేస్ట్ చేయకుండా ఇతర సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాలా' సినిమాకు స్క్రిప్టు రెడీ చేయాల్సిన పరిస్థితి రావడంతో బన్నీతో చేయాల్సిన ప్రాజెక్టును త్రివిక్రమ్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాలా' చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్రివిక్రమ్-బన్నీ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. రెండు నిర్మాణ సంస్థల మధ్య పరస్పర సంబంధాలు ఉండటంతో తివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేస్తున్నారని తెలుస్తోంది. 'గోపాలా గోపాలా' సినిమాకు సంబంధించిన పని పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ బిజీ బిజీగా గడుపనున్నారు. ఆ తర్వాతే బన్నీతో చేసే ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారని అంటున్నారు.

English summary
Allu Arjun-Trivikram new film launch. The movie Produced by Radhakrishna. Samantha lead heroine. Devisri prasad to compose the music. The makers of the movie are considering the title Kavacham for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu