For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'త్రిశూలం' కాదు: అల్లు అర్జున్, త్రివిక్రమ్ టైటిల్ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్: ‘జులాయి' వంటి సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో అల్లు అర్జున్ పై చిత్రీకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. 'హూషారు' అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు త్రిశూలం అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండింటిలో ఏది ఫైనల్ చేస్తారో చూడాలి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఫైట్స్, డాన్స్ విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వినోదంతో పాటు హద్యమైన భావోద్వేగాలు మేళవించిన కథాంశమిదని చిత్ర బందం చెబుతోంది.

  Allu Arjun,Trivikram title Husharu?

  అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. సమంత, అదా శర్మ, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ‘జులాయి' నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

  మరో ప్రక్క మిర్చి ఫేం కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా ఓకే అయినట్లు ఇంతకు ముందు వార్త వచ్చింది. మహేష్‌బాబు సినిమాను శివ మే1 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా...మరోవైపు త్రివిక్రమ్‌ బన్నీల సినిమాకూడా విడుదలకు సిద్ధమవుతుంది. అంటే వీరి సినిమా తొందర్లనే పట్టాలెక్కబోతుందని అంటున్నారు. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనేది తేలియాలి.

  అయితే శేఖర్ కమ్ముల వంటి ఫీల్ గుడ్ చిత్రాలు తీసే దర్శకుడుతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తాడా, లేక యాక్షన్ ,లవ్ స్టోరీతో ముందుకు వెళ్తున్న కొరటాల శివతో ముందుకు వెళ్తాడా అనేది ఇప్పుడు అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది. అలాంటిదేమీ లేదు...ఇది కేవలం రూమరే అని కొందరు బన్ని అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఈ విషయమై బన్ని కానీ శేఖర్ కమ్ముల కానీ మాట్లాడితే కానీ ఈ చర్చ ఆగేటట్లు లేదు.

  ఆనంద్‌, హ్యాపీడేస్‌, లీడర్‌, లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌'....వంటి ఫీల్‌ గుడ్‌ సినిమాలు తీసే శేఖర్‌కమ్ముల...ఎప్పుడూ కమర్షియల్‌ సినిమాలు తీయలేదు. అయితే రీసెంట్ గా ప్రకారం శేఖర్‌ కమ్ముల, అల్లు అర్జున్‌కి కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కథ బన్నీకి కూడా నచ్చడంతో పూర్తి స్ర్కిప్ట్‌ శేఖర్‌కమ్ములను సిద్ధం చేసుకోమన్నాడని సమాచారం. అయితే ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శేఖర్‌ కమ్ముల కూడా ఈ ఏడాది ‘హ్యాపీడేస్‌' చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

  ‘హ్యాపీడేస్‌' రీమేక్‌ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌ నిర్మించబోతున్నాడని సమాచారం. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా తీసే ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే శేఖర్‌ కమ్ముల కూడా కమర్షియల్‌ సినిమాలు తీయగలడని నిరూపించుకోవడానికి ఇదో అవకాశంగా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ మంచి మాస్ హీరో. ఇప్పటివరకు తను చేసిన తరహా మాస్ చిత్రాలను శేఖర్ కమ్ముల తీయలేదు. మరి.. బన్నీ తరహాలో మాస్ చిత్రం చేస్తారా? లేక తనదైన శైలిలో బన్నీని వేరే విధంగా ఆవిష్కరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

  English summary
  Allu Arjun's upcoming project with Trivikram Srinivas has been doing lot of buzz. Trivirkam is considering new title for the film.The star director is considering Husharu as title for his new film .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X