»   » ‘ఘాజీ’టైప్ కథలోనే అల్లు అర్జున్ ? అందుకే ఆ టైటిల్

‘ఘాజీ’టైప్ కథలోనే అల్లు అర్జున్ ? అందుకే ఆ టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దగ్గుపాటి రాగా ప్రధాన పాత్రలో వచ్చిన 'ఘాజీ'ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ సినిమాలో సబ్ మెరైన్స్ , పాక్ వార్ కన్నా జనాలకి పట్టింది దేశభక్తి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా సక్సెస్ కు కారణం ఈ సినిమాలోని దేశభక్తి ప్రేరిత సన్నివేశాలు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అలాగని మరీ 'ఘాజీ' సినిమాలో లాగ ..వార్ బ్యాక్ డ్రాప్ లో ...సబ్ మెరిన్ సెట్ వేసి మరీ తీస్తారని కాదు..దేశభక్తికి సంభందించిన సీన్స్ తో సినిమా సాగుతుందని అర్దం.

వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 'డీజే-దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్‌ ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఇక చిత్రాన్ని ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తారని ఫిలింనగర్‌ సమాచారం. ఈ సినిమానే దేశభక్తికి కేరాఫ్ ఎడ్రస్ గా వక్కంతం వంశీ కథని రెడీ చేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో తీస్తారని తెలుస్తోంది.

Allu Arjun, Vakkatham Vamsi's movie patriotic flavour ?

లగడపాటి శ్రీధర్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే పేరును పరిశీలిస్తున్నారని తెలిసింది. అయితే 'నా పేరు సూర్య..' ఎప్పుడు ప్రారంభించేదీ అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇంతకాలం తన ప్రొడక్షన్ లో లో బడ్జెట్ మూవీలనే తీసుకుంటూ వచ్చిన లగడపాటి శ్రీధర్ ఇప్పుడు బన్ని సినిమాను భారీగా నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఇక సినిమా టైటిల్ గా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని రిజిస్టర్ చేయించారు. దాంతో అల్లు అర్జున్ సినిమా కోసమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు మీడియాలో ప్రచారం అవుతోంది.

ఇకటైటిల్ ఇలా బయటకు వచ్చిదో లేదో అప్పుడే మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది. అంతేకాదు ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని పవర్ ఫుల్ గా చెప్పే బన్ని సినిమాలో ఎలా ఉండబోతాడా అని ఫ్యాన్స్ ఎక్సయిటింగా ఉన్నారు. రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన వక్కంత వంశీ బన్ని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కథ కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు. మరి సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

మరోపక్క ఇటీవల విడుదలైన 'డీజే-దువ్వాడ జగన్నాథమ్‌' ఫస్ట్‌లుక్‌ టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసారు.

English summary
Allu Arjun‘s next film which will be helmed by writer Vakkantham Vamshi.This movie story is laced with patriotic elements that leaves the audience with awe feeling.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu