»   » అల్లు అర్జున్ ‘వరడు’ చిత్ర లోగుట్టు విశేషాలు!

అల్లు అర్జున్ ‘వరడు’ చిత్ర లోగుట్టు విశేషాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అత్యున్నత సాంకేతిక విలువలతో గుణశేఖర్ దర్శకుడిగా యూనివర్శల్ మీడియా పతాకంపై డీవివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'వరుడు". ఈ చిత్రంలో అల్లు అర్జున్ కథానాయకుడు ఎన్నో విశేషాల మధ్య ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం పై పలు అంచనాలు నెలకొని వున్నాయి. ది గ్రేట్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు ఈచిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైనచిత్రాలు రూపొందించిన ఆయన ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను చేశారని వినికిడి.

అలాగే దర్శకుడు గుణశేఖర్, సంగీత దర్శకుడు మణిశర్మ, గేయ రచయిత వేటూరి కలయికలో చిరంజీవి, అంజల జవేరి, సౌందర్య నటించిన 'చూడాలని ఉంది" చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సాంగ్స్ పై కూడా పలు అంచనాలు నెలకొన్నాయి. అలాగే 'వరుడు"లో అల్లు అర్జున్ తల్లిగా సుహాసిని నటిస్తున్నారు. గతంలో చిరంజీవితో పలు చిత్రాలలో నాయికగా చేసిన సుహాసినని తొలి సారిగా వారి కుటుంబానికి చెందిన వారి చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా మొత్తం పూర్తయ్యే వరకు హీరోయిన్ గురించి తెలుపక పోవడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవవచ్చు. కొత్త హీరోయిన్ అన్నారే కానీ ఇంత వరకు ఆమె పేరును కూడా బయటకు తెలపక పోవడం విశేషం.

ఒక్క పాట మినహా పూర్తయిన ఈ చిత్రంను మార్చి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని సరికొత్త విశేషాల మద్య వస్తున్న ఈ చిత్రం దర్శకనిర్మాతలకు ఎటువంటి సంతప్తినిస్తుందో చూడాలంటున్నారు విమర్శకులు. అలాగే ఆర్య 2 పరాజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu