»   » నా పేరు సూర్యలో మైనస్ అదే..బన్నీ పసిగట్టేశాడు..!

నా పేరు సూర్యలో మైనస్ అదే..బన్నీ పసిగట్టేశాడు..!

Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజాగా చిత్రం నాపేరు సూర్య. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బన్నీ ఈ చిత్రంలో ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. దేశభక్తి ఉన్న ఆర్మీమాన్ గా బన్నీ సాహసాలు చేయబోతున్నాడు.

Allu Arjun warns Vakkantham Vamsi

యాక్షన్ భరిత చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ తో లవ్ ట్రాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇటీవల చిత్ర రషెష్ గమనించిన బన్నీ అను ఇమ్మాన్యుయేల్ తో వచ్చే లవ్ ట్రాక్ ఎక్కువైనట్లు అనిపించండట. సినిమాకు అది మైనస్ గా మారే అవకాశం ఉండడంతో బన్నీ డైరెక్టర్ ని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేమ సన్నివేశాలు కొన్నింటిని తొలగించాలని అల్లు అర్జున్ దర్శకుడికి సూచించినట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంతో మరో హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మే 4 న నాపేరు సూర్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Allu Arjun warns Vakkantham Vamsi. He finds minus point in Naa peru surya movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu