»   » మాస్క్‌తో పబ్లిక్‌లోకి అల్లు అర్జున్: కారణం అదేనా, ఇంకేమైనా...

మాస్క్‌తో పబ్లిక్‌లోకి అల్లు అర్జున్: కారణం అదేనా, ఇంకేమైనా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ హీరోలు కాస్తా అసాధారణంగా కనిపిస్తే చాలు, పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఇటీవల అల్లు అర్జున్ ముఖానికి మాస్క్ ధరించి ఓ కార్యక్రమానికి హాజరు కావడంపై పలు రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథమ్‌' సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో బన్నీ తొలిసారి ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే బన్నీ అబుదాబిలో జరిగిన సాంగ్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ వెంటనే హైదరాబాద్‌లో జరిగిన అల్లు రామలింగయ్య అవార్డుల వేడుకకు హాజరయ్యాడు.

Allu Arjun wears mask in a function

అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఈవెంట్‌కు బన్నీ ముఖానికి ఓ మాస్క్‌తో హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నటిస్తున్న 'డీజే' సినిమాలోని బ్రాహ్మిణ యువకుడి పాత్ర కాకుండా మరో పాత్రలో కూడా అల్లు అర్జున్ కనిపించనున్నట్లు చెబుతున్నారు.

ఆ పాత్ర తాలుకు లుక్‌ రివీల్‌ కాకుండా ఉండేందుకే బన్నీ ఇలా మాస్క్‌లో వచ్చాడని అంటున్నారు అబుదాబిలో షూటింగ్‌ కారణంగా బన్నీని జలుబు, దగ్గు తీవ్రంగా బాధిస్తున్నాయని, అలెర్జీ మరింత ముదరకుండా ఉండేందుకే ఇలా మాస్క్‌ వేసుకున్నాడని కూడా టాక్ ఉంది.

English summary
Buzz is that Allu Arjun has weared mask not to reveal his look in Duvvada Jagannatham movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu