Allu Arjun Pushpa Release Date: త్వరలో అధికారిక ప్రకటన కూడా?

అల వైకుంఠ పురంలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

గ్యాప్ తో కరోనా

గ్యాప్ తో కరోనా

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ అల వైకుంఠ పురం అనే సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ సినిమా ప్రారంభించాలి అని అనుకున్నా, కానీ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ లోపు కరోనా మహమ్మారి వచ్చి పడింది.

డీగ్లామర్ రోల్ లో

డీగ్లామర్ రోల్ లో

కరోనా మహమ్మారి కాస్త గాక ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ మొత్తంలో మొట్టమొదటిసారిగా ఒక డీగ్లామర్ రోల్ లో కనిపిస్తూ ఉండడమే కాక పూర్తిగా అటవీ నేపథ్యం కలిగిన సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.

రెండు భాగాలుగా రిలీజ్

రెండు భాగాలుగా రిలీజ్

ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని ముందు నుంచి ఒకే పార్ట్ లో రిలీజ్ చేస్తారని భావించగా కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

వాయిదా పడే అవకాశాలు

వాయిదా పడే అవకాశాలు

ఇక ఈ ఏడాది మొదట్లో అన్ని సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఆ లెక్కన సినిమా ఆగస్టు 13 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు రెండు భాగాలుగా సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తూ ఉండడంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్రిస్మస్ కానుకగా

క్రిస్మస్ కానుకగా

తాజా ప్రచారం మేరకు ఈ సినిమా క్రిస్మస్ కానుకగా 24 వ తేదీన కానీ, 25వ తారీఖున కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇది కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందా ? లేదా అనేది చూడాల్సి ఉంది. సినిమా యూనిట్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ లో ఈ రోజు ప్రారంభం అయింది.

Recommended Video

Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
45 రోజుల సింగిల్ షెడ్యూల్

45 రోజుల సింగిల్ షెడ్యూల్

టాలీవుడ్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా షూటింగ్ 45 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంస్థ కూడా సహ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన నటిస్తుండగా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ లాంటి వాళ్ళు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X