»   » అల్లు శిరీష్ హీరోగా త్వరలోనే తెలుగు చిత్రం

అల్లు శిరీష్ హీరోగా త్వరలోనే తెలుగు చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలో హీరోగా అవతరించబోతున్నాడు.అతనికోసం గీతా ఆర్ట్స్ లో కథలు వింటున్నారు.రెండు మూడు లైన్స్ కి చెందిన స్క్రిప్టులు కూడా రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. అల్లు శిరీష్ ఈ మద్యనే ముంబైకి చెందిన ఏక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకొచ్చారు.అతనితో రీసెంట్ గా ఫోటో షూట్ కూడా జరిపి తృప్తి చెందినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ ఈ విషయమై పూర్తి దృష్టి పెట్టి పెద్ద దర్శకులతో మాట్లాడి,తన కుమారుడ్ని పరిచయం చేయటానికి దారి రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు.ఇక అల్లు అర్జున్ ఈ విషయమై చిరంజీవి సలహా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్తున్నారు. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పూర్తి స్ధాయిలో పనులు ప్రారంభమవుతాయని, ఓ కొత్త స్టాటజీతో అల్లు శిరీష్ ని పరిచయం చేయాలని అల్లు అరవింద్ నిర్ణంయించుకున్నట్లు చెప్తున్నారు.

English summary
Allu Sirish might just make his acting debut in Telugu films. Recently, he even completed a test photo shoot and is satisfied.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu