»   » బొత్సా సత్యనారాయణతో అల్లు అరవింద్ వియ్యం?

బొత్సా సత్యనారాయణతో అల్లు అరవింద్ వియ్యం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ని బొత్సా సత్యనారాయణ అల్లుడుగా చేసుకునే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ గుసగుసలు వినపడుతున్నాయి. తాజాగా బొత్సా నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా లవ్ ఆజ్ కల్ రీమేక్ ని చేస్తున్నారు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా అల్లు అరవింద్ తో కలిసి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వీరు వియ్యంకులు కూడా అయ్యే అవకాశం ఉందని అంతటా వినపడుతోంది. ఇది నిజమవ్వటానకి కూడా అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజకీయ, సినీ రంగాలు ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయని, అందులోనూ ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన మెగా ఫ్యామిలీ ఈ రకంగా ముందుకు వెళ్ళినా ఆశ్చర్యపోవల్సిందేమీ లేదంటున్నారు. ఇక లవ్ ఆజ్ కల్ రీమేక్ ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగులు అందిస్తున్న ఈ చిత్రానికి పరిశ్రమలోని పెద్ద టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. గణేష్ వర్కింగ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu