»   » మహేష్ పై రివేంజ్ తీర్చుకుంటున్న అల్లు శిరీష్

మహేష్ పై రివేంజ్ తీర్చుకుంటున్న అల్లు శిరీష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు పై అల్లు శిరీష్ రివేంజ్ తీర్చుకోబోతున్నారా అనే అంశమే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దూకుడు సమయంలో అవి ఫేక్ కలెక్షన్స్ అంటూ ట్విట్టర్ ద్వారా అల్లు శిరీష్ రియాక్ట్ అయ్యారు. అయితే అప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ...మహేష్ గురించి మాట్లాడే అంతటి గొప్ప వాడివా...కెరీర్ లో నువ్వేం సాధించావు అంటూ సీరియస్ గా కౌంటర్స్ ఇచ్చారు. అది మనస్సులో పెట్టుకుని ఇప్పుడు తన తాజా చిత్రం కొత్త జంటలో మహేష్ ని స్పూఫ్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నదాని ప్రకారం...మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని కొత్త జంటలో స్ఫూఫ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహేష్ బాబు పాత్రను సంపూర్ణేష్ బాబుపై చిత్రీకరించారని, అయితే అల్లు అరవింద్ జోక్యంతో ఆ ట్రాక్ తొలిగించారని తెలుస్తోంది. తర్వాత దాన్ని వేరే వారిపై చిత్రీకరించారని అంటున్నారు. అదంతా అల్లు శిరీష్ ఇచ్చిన ఐడియా అని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవముంది అనేది సినిమా విడుదల అయితే గానీ తెలియదు.

Allu sirish revenge on mahesh babu

అల్లు శిరీష్‌, రెజీనా జంటగా నటించిన చిత్రం 'కొత్తజంట'. మధురిమ ముఖ్యపాత్రధారి. మారుతి దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. సెన్సారు పూర్తయింది. మారుతి మాట్లాడుతూ ''సినిమాను మే 1న విడుదల చేస్తున్నాం. నా గత చిత్రాలకన్నా ఓ మెట్టు పైనే ఉంటుందీ సినిమా. ఇంటిల్లిపాదినీ అలరించే వినోదాత్మక చిత్రం. శిరీష్‌ నటన ఆకట్టుకుంటుంది'' అన్నారు.

''ప్రేక్షకులు మా సినిమాని చూసి మంచి ఫలితాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. అందర్నీ అలరించేలా చిత్రాన్ని దర్శకుడు మలిచారు''అని అల్లు శిరీష్‌ చెప్పారు. ''అర్జున్‌ రేసుగుర్రంలా శిరీష్‌ 'కొత్తజంట' కూడా విజయానందాన్ని అందిస్తుందనే ఆశిస్తున్నాం'' అన్నారు అల్లు అరవింద్‌.

మధురిమ, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, కూర్పు: ఉద్ధవ్‌, కళ: రమణ.ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

English summary
As per reports, the Kotha Janta film has few spoof scenes of Mahesh Babu starred ‘Seethamma Vakitlo Sirimalle Chettu.’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu