»   »  ‘కొత్త జంట': శాటిలైట్ రైట్స్ వెనక అసలు కిటుకు

‘కొత్త జంట': శాటిలైట్ రైట్స్ వెనక అసలు కిటుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టీవీ ఛానెల్స్ చిన్న చిత్రం శాటిలైట్ రైట్స్ రిలీజయ్యక రిజల్ట్ ని బట్టే తీసుకుంటున్నాయి. అయితే అల్లు శిరీష్‌, రెజీనా జంటగా నటించిన చిత్రం 'కొత్తజంట' చిత్రానికి మినహాయింపు లభించింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని మాటీవీ వారు తీసుకున్నారు. రెండు కోట్ల రూపాయలు మొత్తం చెల్లించి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం నిర్మాత అల్లు అరవింద్ కావటం వల్లే ఇలా శాటిలైట్ రైట్స్ , అంత పెద్ద మొత్తానికి వెంటనే అమ్ముడయ్యాయని సమాచారం. మా టీవి...అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన ఛానెల్ కావటం కలిసి వచ్చిందంటున్నారు. కాబట్టే చిన్న చిత్రమైనా, హీరోగా క్రేజ్ లేకపోయినా ఆ మొత్తాన్ని మాటీవీ చెల్లించిందని తెలుస్తోంది.

నిర్మాత మాట్లాడుతూ... ''మారుతి తరహా చిత్రమిది. అల్లు శిరీష్‌ తెరపై కనిపించే విధానం వైవిధ్యంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది.'' అన్నారు నిర్మాత.

Allu Sirish's Kotta Janta satellite rights bagged

దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేక్షకులకు వినోదాన్ని అందించే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇంటిల్లిపాదీ చూసి ఆనందించదగ్గ సినిమా ఇది. శిరీష్‌, రెజీనా జంట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా '' అన్నారు.


మారుతి దర్శకత్వం వహించారు. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. 1 విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. మధురిమ, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, కూర్పు: ఉద్ధవ్‌, కళ: రమణ.ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

English summary
MAA TV bagged the satellite rights of Allu Sirish,Regina starrer Kotta Janta for a whopping sum of Rs 2crs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu