»   » అయ్యో... మళ్లీ అక్కినేని అమలకు చేదు అనుభవం!

అయ్యో... మళ్లీ అక్కినేని అమలకు చేదు అనుభవం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు హీరోయిన్‌గా సౌత్ లో పలు సినిమాల్లో నటించిన అమల.... తర్వాత అక్కినేని నాగార్జునను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె ఆ మధ్య శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

అయితే రీ ఎంట్రీ అమలకు పెద్దగా కలిసి రాలేదు. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తర్వాత ఆమె తెలుగులో మళ్లీ ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. ఇతర భాషలపై తన దృష్టి సారించింది.

అక్కడా ప్లాపులు

అక్కడా ప్లాపులు

తరువాత హిందీలో హమారీ అధూరి కహాని సినిమాలో ఒక పాత్రను చేసింది. రీసెంటుగా మలయాళంలో కేరాఫ్ సైరా భాను అనే సినిమాలో కూడా ఒక చిన్న వేషం వేసింది అమల. అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో అమలకు రీ ఎంట్రీ విషయంలో చేదు అనుభవమే మిగిలిందని అంటున్నారంతా.

సినిమాలు చేస్తుందా?

సినిమాలు చేస్తుందా?

ఈ పరిణామాలతో అమల ఇకపై ఏ సినిమాలూ చేయబోనని నిర్ణయించుకుందట. సినిమాలు చేసి అనవసరంగా ప్లాపులు మూటగట్టుకోవడం కంటే ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టడం మంచిదని భావిస్తోందట.

బ్లూ క్రాస్

బ్లూ క్రాస్

అమల కొంతకాలంగా జంతుసంరక్షణ కోసం బ్లూక్రాస్ సంస్థను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలతోనే ఇకపై ముందుకు సాగాలని, సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాక్.

అఖిల్ పెళ్లి కేన్సిల్ ఇష్యూ.... అవకాశం కూడా ఇవ్వని అమల అక్కినేని!

అఖిల్ పెళ్లి కేన్సిల్ ఇష్యూ.... అవకాశం కూడా ఇవ్వని అమల అక్కినేని!

టాలీవుడ్లో ఇపుడు మోస్ట్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే... అది అఖిల్ అక్కినేని పెళ్లి రద్దు అంశమే. ప్రముఖ వ్యాపారవేత్త జీవికె రెడ్డి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి శ్రీయా భూపాల్‌తో అఖిల్.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Akkineni Amala has made a comeback with Sekhar Kammula's 'Life Is Beautiful' which didn't impress either. And after almost 5 years now, Amala featured in next 'C/O Saira Bhanu' (Malayalam) which also is receiving bad reviews.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu