»   » విడాకుల దిశగా అమలా పాల్-విజయ్, కారణాలు ఇవేనా?

విడాకుల దిశగా అమలా పాల్-విజయ్, కారణాలు ఇవేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ దర్శకడు ఎఎల్.విజయ్‌ సినిమాల్లో నటించిన హీరోయిన్ అమలా పాల్ అతడితో ప్రేమలో పడటం, జూన్ 12, 2014లో ఇద్దరూ వివాహం చేసుకోవడం తెలిసిందే. రెండేళ్లు గడిచిందో లేదో? అప్పడు వీరి సంసార బంధం బీటలవారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలో అమలా పాల్-విజయ్ విడాకుల తీసుకోబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పెళ్లైన సంవత్సరం వరకు వీరి సంసారం హ్యాపీగానే సాగినా.... క్రమ క్రమంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా ఇద్దరూ దూరంగానే ఉంటున్నారని టాక్.

అమలా పాల్ లైఫ్ స్టైల్, దర్శకుడు విజయ్ లైఫ్ స్టైల్ భిన్నంగా ఉండటంతో ఒకరితో ఒకరు అడ్జెస్ట్ కాలేక పోతున్నారని, ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని అంటున్నారు వారి సన్నిహితులు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

విజయ్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాల్లో అమలా పాల్ హీరోయిన్ గా చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ చేసారు. అమలా పాల్ క్రిస్టియన్, విజయ్ హిందూ.. మతాలు వేరైనా పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రెండు సంప్రదాయాల ప్రకారం క్రిస్టియన్ స్టైల్ లో ఎంగేజ్మెంట్, హిందూ స్టైల్ లో వివాహం జరిగింది.

స్లైడ్ షోలో విడాకులకు గల కారణాలు..

మూడేళ్లు

మూడేళ్లు

మూడేళ్ల పాటు ప్రేమించుకున్న సమయంలో ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడంతో పెళ్లి తర్వాత ఇద్దరూ కలకాలం కలిసుంటారని భావించారు.

అమలా పాల్

అమలా పాల్

పెళ్లైన సంవత్సరం వరకు అమలా పాల్ తన భర్తతో కలిసి విదేశీ టూర్లు, సినిమా ఫంక్షన్లలో సందడి చేసింది. ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులన్నింటిలో విజయ్ కనిపించే వాడు.

ఇపుడు

ఇపుడు

కానీ కొంత కాలంగా అమలా పాల్ పోస్టులో విజయ్ కనిపించడమే లేదు. అంతకు ముందు ఎక్కడికెల్లిన విజయ్ తన భార్యతో కలిసి వెళ్లే వాడు. ఇపుడు ఏ ఫంక్షన్లో చూసినా ఒంటరిగానే కనిపిస్తున్నాడు.

ఏమిటో.

ఏమిటో.

అంతలా ప్రేమించుకుని, ఎంతగానో ఒకరినొకరు అర్థం చేసుకున్న వీరు ఇలా విడిపోవడం ఏమిటో....

కారణం

కారణం

ఇద్దరి మధ్య విబేధాలు రావడానికి ప్రధాన కారణం అమలా పాల్ కుటుంబ సభ్యులే అనే ప్రచారం జరుగుతోంది.

విజయ్ వేగలేకే..

విజయ్ వేగలేకే..

ఎప్పుడూ అమలా పాల్ ను వెన్నంటి ఉండే ఆమె కుటుంబ సభ్యుల తీరుతో విజయ్ వేగలేక పోతున్నాడని టాక్.

మనస్పర్థలు

మనస్పర్థలు

ఈ క్రమంలోనే అమలా పాల్, విజయ్ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.

విడాకుల దిశగా..

విడాకుల దిశగా..

ఈ మనస్పర్థలే వీరి వివాహ బంధం విడాకుల దిశగా వెళ్లేలా చేసాయట.

English summary
There were reports that Amala Paul and AL Vijay's marriage is in trouble and that the couple is heading for divorce.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu