»   » అమలాపాల్ పెళ్లి: డబ్బు వెనక్కి ఇచ్చేయమంటున్నారు

అమలాపాల్ పెళ్లి: డబ్బు వెనక్కి ఇచ్చేయమంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అమలాపాల్ తన ప్రియుడుతో వివాహానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అమాలాపాల్ వివాహం ఇప్పుడు ఆమెతో సినిమా కమిటైన వారిని ఇబ్బందుల్లో పడేసింది. వారు ఇప్పుడు ఆమెను తొలిగించి వేరే హీరోయిన్ ని తమ ప్రాజెక్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెను రెమ్యునేషన్ ని వెనక్కి ఇవ్వమని అడిగినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే... హవీశ్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్, కిరణ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా అమలాపాల్ ఎంపిక చేసారు. అయితే ఆమెకు పెళ్లై పోతే తమ ప్రాజెక్టుకి సమస్య వస్తుందని భావిస్తున్నారు. వివాహిత నటించిందని తెలిస్తే..లవ్ స్టోరీ పండదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పెళ్లి విషయం ముందే తమకు తెలిస్తే తాము జాగ్రత్తపడుదుమని వాపోతున్నట్లు తెలుస్తోంది. తాము అందరిలా తమ హీరోయిన్ వివాహం...అందరితో పాటు మీడియా ద్వారా తెలిసికోవాల్సి వచ్చిందని, ఇలా అమలాపాల్ తమకు దెబ్బకొట్టిందని, శ్రేయాభిలాషుల వద్ద నిర్మాతలు బాధపడినట్లు తెలుస్తోంది.

Amala Paul out of Vasta Nee Venuka Movie

ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఇష. ఈ విషయాన్ని దర్శకుడు రమేశ్ వర్మ వెల్లడిస్తూ 'బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమ, వినోదం సమపాళ్లలో మిళితమై ఉంటాయి. హవీశ్ పాత్ర యువతరాన్ని ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. గ్లామర్, పెర్ఫార్మెన్స్ మిళితమైన పాత్ర అమలాపాల్‌ది. సినిమాకి వెన్నెముకలాంటి పాత్రను ఇష చేస్తుంది' అని చెప్పారు.

బ్రహ్మానందం, సుమన్, రావు రమేశ్, సుధ, తులసి, హేమ, ప్రవీణ్, అక్షిత, సప్తగిరి, ఇంద్ర, మణేశ్, కార్తికేయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన: విస్సు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ, ఫొటోగ్రపీ: విజయ్ కె.చక్రవర్తి.

English summary
Filmmakers of Vasta Nee Venuka are planning to replace Amala Paul with another actress. The film directed by Ramesh Varma stars Havish in lead and is produced by Dasari Kiran Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu