Just In
- 24 min ago
కార్తీకేయ 2 కోసం బాలీవుడ్ నటుడు.. అదిరిపోయే అప్డేట్
- 42 min ago
అవన్నీ తప్పుడు వార్తలే.. నా పర్మిషన్ లేకుండా.. సురేఖా వాణి స్వీట్ వార్నింగ్
- 54 min ago
షాదీ ముబారక్ కలెక్షన్లు.. సాగర్ ఆర్కే నాయుడుపై తరగని ప్రేక్షకుల ఆదరణ!
- 1 hr ago
స్టార్ క్రికెటర్‌తో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి.. ఎప్పుడు.. ఎక్కడంటే?
Don't Miss!
- News
మహమూద్ అలీ మనవడిపై ర్యాగింగ్ కేసు: తమను కాపాడాలంటూ పోలీసులకు వేడుకోలు
- Sports
అదే ఇంగ్లండ్ కొంపముంచింది.. దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి: సునీల్ గవాస్కర్
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘జాన్’ నుంచి బిగ్ ఫిగర్ ఔట్: ప్రభాస్ సినిమాకు ఊహించని కష్టం.. అసలు కారణం ఇదే.!
రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు స్టార్ హీరో ప్రభాస్. తొలి చిత్రం 'ఈశ్వర్'తోనే విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇలాంటి సమయంలో భారీ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సిరీస్‌తో ప్రభాస్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన 'సాహో'తోనూ హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా అతడు చేస్తున్న చిత్రానికి ఊహించని కష్టం వచ్చి పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే....

వాళ్లకు బాగా నచ్చింది.. ఇక్కడ మాత్రం ఫెయిల్
‘బాహుబలి' వంటి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ‘సాహో'. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. అయితే, ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. కానీ, హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది. అంతేకాదు, అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

మరో యాంగిల్ చూపించబోతున్న ప్రభాస్
‘సాహో'పై పెట్టుకున్న ఆశలపై ప్రేక్షకులు నీళ్లు జల్లడంతో ప్రభాస్ నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలోనే అతడు తనలోని సరికొత్త యాంగిల్ చూపించడానికి ‘జాన్' (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గోపికృష్ణ బ్యానర్‌తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.

దీనిపై ఎన్నో హాట్ టాపిక్ అవుతున్నాయి
1960వ దశకం నాటి కథతో వస్తున్న ‘జాన్' గురించి కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. పిరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నటించే ఆర్టిస్టుల గురించి పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాగే, కథ లీక్ అయిందని కూడా టాక్ వినిపించింది. వీటితో పాటు ఎన్నో సరికొత్త అంశాలు తెరపైకి వస్తుండడంతో ఈ మూవీ హాట్ టాపిక్ అవుతోంది.

ఒకరు దొంగ.. మరొకరు లవర్ బాయ్
ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడన్న విషయాన్ని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, ఆ మధ్య ఈ సినిమా గురించి మరో వార్త బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. అందులో ఒక పాత్ర లవర్ బాయ్ కాగా, మరో క్యారెక్టర్ దొంగ అని అంటున్నారు. ఈ దొంగ పాత కాలం నాటి కార్లను దొంగిలిస్తుంటాడనే టాక్ వినిపిస్తోంది.

‘జాన్' నుంచి బిగ్ ఫిగర్ ఔట్
‘సాహో' నిరాశను మిగల్చడంతో ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిపోయాడు ప్రభాస్. ఇందులో భాగంగానే ఈ సినిమాకు పని చేసే టెక్నీషియన్ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ అమిత్ త్రివేదిని తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. తాజాగా ఆయన సినిమా నుంచి దూరమయ్యారని వార్త ఒకటి బయటకు వచ్చింది.

సినిమాకు ఊహించని కష్టం.. కారణం ఇదే.!
అమిత్ త్రివేది పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల ‘సైరా: నరసింహారెడ్డి'కి కూడా పని చేశారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ యూనిట్ సందిగ్ధంలో పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలని చర్చలు జరుపుతున్నారట. అమిత్ తప్పుకోడానికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణమని సమాచారం.