»   » ఎవరిదీ టైటిల్? : ఎన్టీఆర్ దా రామ్ చరణ్ దా??

ఎవరిదీ టైటిల్? : ఎన్టీఆర్ దా రామ్ చరణ్ దా??

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఓ టైటిల్ తమ పేరున రిజిస్టర్ చేయగానే ఆ టైటిల్ తో ఏ హీరో సినిమా చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారిపోతోంది. తాజాగా 'అనగనగా ఒక పులి' అనే టైటిల్ ని ప్రముఖ నిర్మాత బి.వియస్ ఎన్ ప్రసాద్ తమ బ్యానర్ పై రిజిస్టర్ చేసారు. దాంతో ఏ హీరోతో ఈ సినిమా చేయబోతున్నారనేది అంతటా చర్చగా మారింది. ముఖ్యంగా బి.వి.యస్ ఎన్ ప్రసాద్ దగ్గర ఎన్డీఆర్, రామ్ చరణ్ డేట్స్ ఉన్నాయని, వారిద్దరిలో ఎవరో ఒకరి కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేసారని చెప్పుకుంటున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం డైరక్ట్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం బి.వియస్ యన్ ప్రసాద్... అత్తారింటికి దారేది చిత్రం నిర్మించి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆందోళన కార్యక్రమాలు, చిరంజీవి ఫ్యామిలీ సినిమాలను సీమాంధ్ర ప్రాంతంలో అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో విడుదల నిలిచి పోయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు.

కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి. ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Each day many titles keep getting registered with film chamber but when a big producer registers then discussions happen. Currently, producer BVSN Prasad has registered a title ‘Anaganaga Oka Puli’. The filmnagar circles are debating whether this film title will be going for Ram Charan or Junior NTR. It is heard that Prasad has got the dates of both these star heroes and some are stating this will go for Charan only because his father Chiranjeevi and Babai Pawan Kalyan did ‘Puli’ but that cannot be the basis.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu