»   » అనసూయకు భారీ ఆఫర్, కెరీర్ మలుపు తిరిగింది

అనసూయకు భారీ ఆఫర్, కెరీర్ మలుపు తిరిగింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్‌ వంటి కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ బిజీగా కనిపించే అనసూయ, ఒక్కసారిగా సోగ్గాడే లో కనిపించి రెచ్చిపోయి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత పీవీపీ సినిమా పతాకంపై తెరకెక్కించిన 'క్షణం' చిత్రంలో పోలీసు అధికారిణి పాత్రలో అదరకొట్టింది. దాంతో ఆమెకు ఆఫర్స్ వరస పెట్టి ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

అనసూయ ఫోటో గ్యాలెరీ

అయితే ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవటం లేదని సమాచారం. తాజాగా ఆమె పీవీపి బ్యానర్ లోనే రూపొందనున్న మరో చిత్రం కమిటైందని సమాచారం.

Also Read: నమ్మని నిజం : వీళ్ళంతా టీవి నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చినవాళ్లే

అందుతున్న సమాచారం ప్రకారం ఇదొక యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం అని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు, కథ ఫైనలైజ్ అయ్యాయని, ఈ మేరకు అనసూయకు ఓ భారీ మొత్తాన్నేఆఫర్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

Anasuya again with PVP

ఇప్పుడిప్పుడే వెండితెరపై అడుగులు వేస్తోన్న అనసూయకు, ఎదిగేందుకు పివిపి వంటి స్టార్ బ్యానర్ తో ముందుకు వెళ్ళటం ఫెరఫెక్ట్ ఛాయిస్ అంటున్నారు. రాబోయే సినిమాలో ఖచ్చితంగా మిగతా హీరోయిన్లకు తీసుపోని రీతిలో ఆమె దుమ్ముదులపనుందని అంటున్నారు.

ఈ సినిమా కూడా వర్కవుట్ అయితే అటు అంజలి, ఇటు కలర్స్ స్వాతి, తన తోటి యాంకర్ రేష్మిలకు గట్టి పోటి ఇస్తున్నట్లే. వాళ్ల ఛాన్స్ లు ఆమె ఎగరేసుకుపోయినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. బెస్టాఫ్ లక్ అనసూయ.

English summary
Potluri Vara Prasad (PVP) who produced ‘Kshanam’ is reportedly coming up with a big budget film with Anchor Anasuya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu