»   »  ఐటం సాంగుకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా?

ఐటం సాంగుకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాట్ యాంకర్ అనసూయ సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'విన్నర్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఈ సాంగ్ యూట్యూబ్ ద్వారా విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

ఈ పాటలో నటించినందుకుగాను అనసూయ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందట. దాదాపు రూ. 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండటంతో ఈ మొత్తం ఇవ్వడానికి ఏ మాత్రం వెనకాడలేదట.

అనసూయ చేసిన 'సూయ సూయ' సాంగ్ హిట్టయితే... ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు. డిమాండ్ పెరిగితే రెమ్యూనరేషన్ కూడా భారీగా వసూలు చేసేందుకు సిద్ధమవుతోందట.

rn

సూయ సూయ అనసూయ

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న 'విన్నర్' చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. ఇటీవలే సాయి ధరమ్ తేజ్, అనసూయలపై పాటను చిత్రీకరించారు.

 సెట్స్ లో

సెట్స్ లో

డాన్స్ మాస్టర్ రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ సూయ సూయ పాటను చిత్రీకరించారు. షూటింగ్ సయంలో సెట్స్ లో మూవీ టీంతో కలిసి దిగిన ఫోటోను అనసూయ సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది.

 యాంకర్ సుమ

యాంకర్ సుమ

సంగీత దర్శకుడు తమన్ ...పలు సినీ పంక్షన్స్ లో సుమ గొంతు విని..ఆమెను పాట పాడటానికి ఒప్పించారు. మళయాళంలో పుట్టినా, తెలుగు టీవి ప్రపంచంలో సుమ నెంబర్ వన్. తెలుగుని తెలుగులో చాలా మంది కన్నా స్పష్టంగా పలకుతూ మాట్లాడటం ఆమె స్పెషాలిటి. అలాంటి ఆమె ఏకంగా తెలుగులో పాట పాడి సంచలనం సృష్టించబోతోంది. అదీ అనసూయ కాంబినేషన్ లో అంటే దుమ్మురేపటం ఖాయం కదా.

 అనసూయ దశ తిరుగుతుందా

అనసూయ దశ తిరుగుతుందా

విన్నర్ సినిమాలో అనసూయ చేసిన సూయ సూయ సాంగ్ హిట్టయితే ఆమెకు వరుస అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు.

English summary
Film Nagar source said that, Anasuya get 10 lakh remuneration for Winner movie item song. Sai Dharam Tej starrer Winner is directed by Gopichand Malineni and produced by Nallamalapu Bujji and Tagore Madhu whereas the music is scored by SS Thaman. It is gearing up for grand release on 24th February.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu