For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anasuya Bharadwaj: యాంకర్ గా అనసూయ చెల్లి.. బుల్లితెరకు రిటైర్ మెంట్? సూపర్ స్కెచ్!

  |

  బుల్లితెరపై తమదైన అందం, చలాకీ తనంతో ఎంతో మంది యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవా చాటుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి. యాంకర్‌గా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే గ్లామర్ తో పాటు హోస్టింగ్‌తో అలరించిన ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. అలాగే సోషల్ మీడియాలో హల్ చల్ చేసే అనసూయ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతోంది. తను అవకాశాలు అందుకోవడమే కాకుండా తన చెల్లికి కూడా ఆఫర్లు దక్కేలా చేస్తోంది ఈ యాంకరమ్మ.

   న్యూస్ యాంకర్ గా పాపులారిటీ..

  న్యూస్ యాంకర్ గా పాపులారిటీ..

  యంగ్ టైగర్ ఎన్టీర్, బ్యూటిఫుల్ సదా హీరోహీరోయిన్లుగా నటించిన 'నాగ' చిత్రంలో చిన్న పాత్రను చేసిన అనసూయ భరద్వాజ్ న్యూస్ యాంకర్ గా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత మా మ్యూజిక్ కు యాంకర్ గా పని చేసిన అనసూయ తర్వాత జబర్ధస్త్ షోలో వ్యాఖ్యాతగా ఛాన్స్ కొట్టేసింది. ఈ ప్రోగ్రామ్ లో అద్భుతంగా హోస్టింగ్ చేసి అందరి దృష్టిలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది.

  సినిమాల్లోకి రీ ఎంట్రీ..

  సినిమాల్లోకి రీ ఎంట్రీ..

  అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా ఎదిగింది. అయితే ఓవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు వెండితెరపై సందండి చేసింది ఈ హాట్ యాంకర్. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ యాంకర్.. క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం, థ్యాంక్యూ బ్రదర్, ఖిలాడీ, పుష్పతోపాటు పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

  గాడ్ ఫాదర్ లో జర్నలిస్ట్ గా..

  గాడ్ ఫాదర్ లో జర్నలిస్ట్ గా..

  ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రంలో జర్నలిస్ట్ గా ఆకట్టుకుంది. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ లో ఓ పాత్ర చేయడంతోపాటు స్పెషల్ సాంగ్ లో కూడా తళుక్కుమంది. అలాగే సునీల్ తో కలిసి దర్జా మూవీలో నటించింది. ప్రస్తుతం అనసూయ చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నట్లే తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ, వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్ చిత్రాలతోపాటు ఓ వెబ్ సిరీస్ లో వేశ్య పాత్రలో నటించనుంది.

   అనసూయకు ఇద్దరు చెల్లెల్లు..

  అనసూయకు ఇద్దరు చెల్లెల్లు..

  అయితే దాదాపుగా బుల్లితెరపై యాంకర్ గా అనసూయ కొనసాగకపోవచ్చు అని ఓ టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తన వారసురాలిగా ఆమె చెల్లెల్ని బుల్లితెరకు ఇంట్రడ్యూస్ చేయనుందని టాక్. అనసూయకు ఇద్దరు చెల్లెల్లు ఉండగా వారిలో ఒకరిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందట అనసూయ భరద్వాజ్. అచ్చం అనసూయ పోలికలతో ఉండే వైష్ణవిని యాంకర్ గా పరిచయం చేయాలని అనసూయ అనుకుంటుందని టాక్.

  ఇప్పటికే షో ప్లాన్ చేసి..

  ఇప్పటికే షో ప్లాన్ చేసి..

  ఇప్పటికే ఓ మీడియా సంస్థలో పని చేస్తున్న వైష్ణవి తన అక్క స్ఫూర్తితో యాంకర్ గా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనుందట. ఈ మేరకు ఓ ఛానెల్ లో ఇప్పటికే షో ప్లాన్ చేసి వైష్ణవిని ఓకే చేశారట. అతి త్వరలో ఈ షో ప్రారంభం కానుందని సమాచారం. సో ఇలా.. బుల్లితెరకు తను రిటైర్ మెంట్ ప్రకటించి.. తన వారసురాలిగా చెల్లెలు వైష్ణవిని దించనుందని తెలుస్తోంది. మరి ఇదంతా నిజమైతే యాంకర్ గా వైష్ణవి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కానీ ఇలా అనసూయ బుల్లితెరకు రిటైర్ మెంట్ ప్రకటించి తన చెల్లెల్ని యాంకర్ గా ఇంట్రడ్యూస్ చేయడమనే స్కెచ్ మాములుగా లేదు అనిపిస్తోంది కదా.

  English summary
  Tollywood Popular Anchor Anasuya Bharadwaj Introducing Her Sister Vaishnavi As Anchor And Anasuya Announced Her Retirement Rumors Goes Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X