»   » వాడుకోవాలనుకొన్నారు.. కానీ శ్రీముఖి హ్యాండిచ్చిందట.. పాపం బాబు..?

వాడుకోవాలనుకొన్నారు.. కానీ శ్రీముఖి హ్యాండిచ్చిందట.. పాపం బాబు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో 'బాబు బాగా బిజీ' సినిమాపై జరిగిన చర్చ ఇటీవల కాలంలో ఈ చిత్రపైనా కూడా జరుగలేదు. హిందీలో ఘన విజయం సాధించిన హంటర్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అశ్లీల సన్నివేశాలు అతిగా ఉన్నాయని, మితిమీరిన శృంగారం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న బాబు బాగా బిజీ సినిమాలో అవసరాల శ్రీనివాస్, శ్రీముఖి, తేజస్వి తదితరులు నటించారు. ఈ చిత్రం మే 5వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది.

ప్రమోషన్‌కు హ్యాండ్..

ప్రమోషన్‌కు హ్యాండ్..

ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు, రూమర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌కు యాంకర్ శ్రీముఖి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ప్రమోషన్ కొసం ఇతర హీరోయిన్లతోపాటు ఫొటోషూట్ చేయాలని చిత్ర నిర్మాతలు శ్రీముఖిని సంపద్రించారట. సినిమా ప్రచారం కోసం ఉపయోగపడేలా సహకరించాలని వారు కోరారట. అయితే కార్యక్రమానికి చెప్పపెట్టకుండా శ్రీముఖి హాజరుకాకపోవడంపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.


శ్రీముఖిని వాడుకోవాలనుకోవాలన్నారు..

శ్రీముఖిని వాడుకోవాలనుకోవాలన్నారు..

ఈ సినిమాలో శ్రీముఖితోపాటు తేజస్వి, సుప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిగితా వారితో పోల్చుకుంటే శ్రీముఖి క్రేజ్ ఎక్కువ.అందుకే ప్రమోషన్, ప్రచార పోస్టర్లకు శ్రీముఖిని వాడుకోవాలని భావించారు చిత్ర నిర్మాతలు. అయితే తీరా సమయానికి తనకు సమయం లేదని, ఇతర కార్యక్రమాల్లో బిజీ అని చెప్పి హ్యాండించినట్టు తెలుస్తున్నది.


ఉన్నంతలోనే..

ఉన్నంతలోనే..

శ్రీముఖి హ్యాండివ్వడంతో చేసేది ఏమీ లేక ఇతర హీరోయిన్లను ప్రయోషన్‌కు ఉపయోగించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా తమ వద్ద ఉన్న స్టిల్స్‌తోనే శ్రీముఖిని ప్రమోషన్‌కు వాడుకోవాలని చూస్తున్నారట.


షాక్ తిన్న సెన్సార్ అధికారులు..

షాక్ తిన్న సెన్సార్ అధికారులు..

ఇటీవల బాబు బాగా బిజీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్లు షాక్ గురయ్యారట. సినిమాలో కొన్ని సీన్లు చూడలేక మహిళా అధికారులు బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. తొలుత ఈ చిత్రంపై సెన్సార్ అధికారులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేయగా దర్శకుడు నవీన్ నిరసన వ్యక్తం చేశారట. హిందీ సినిమా హంటర్‌కు లేని అభ్యంతరాలు ఈ సినిమాకు ఎందుకు అని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే కొన్ని అభ్యంతరాలతో సెన్సార్ సర్టిఫికెట్స్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.English summary
After facing quite a few problems from the Censor Board, Babu Baga Busy, a remake of Hindi adult comedy Hunterrr, was finally cleared. The Censor officer initially didn’t agree to clear the film as he felt that it had a lot of adult content.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu