»   » టైటిల్ తోనే బాలయ్యని పడేసిన కుర్ర డైరక్టర్

టైటిల్ తోనే బాలయ్యని పడేసిన కుర్ర డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణను డైరక్ట్ చేయాలని ఎప్పుడూ కొత్త డైరక్టర్స్ ఉత్సాహపడుతూనే ఉంటారు. ఎందుకంటే బాలకృష్ణకు సరైన కథ పడితే సాలిడ్ హిట్ వస్తుందని వారికి తెలుసు. అందుకే చాలా మంది దర్శకులు తమ కెరీర్ లో బాలయ్యతో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ప్లాన్ చేస్తూంటారు. ఇప్పుడా టర్న్ పటాస్ డైరక్టర్ అనీల్ రావిపూడి వైపుకు వచ్చింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా బాలకృష్ణను కలిసిన అనీల్ రావిపూడి ఓ కథను వినిపించారు. బాలకృష్ణ కూడా స్టోరీ లైన్ వినగానే వెంటనే ఇంప్రెస్ అయ్యి..పూర్తి కథతో రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అనీల్ రావిపూడి టీమ్ చాలా ఉత్సాహంగా వర్క్ మొదలెట్టింది.

Anil Ravipudi to direct Balakrishna?

దాంతో ఇప్పుడు బాలకృష్ణ ఈ కథను తన వందవ చిత్రం కోసం విన్నారా...ఇదే ఆయన చేయబోయే తదుపరి చిత్రమా అనే సందేహం అందరిలో మొదలైంది. అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్ ..రామారావు గరు అని పెట్టినట్లు చెప్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ చిత్రం సుప్రీమ్ షూటింగ్ లో ఉన్న అనీల్ రావిపూడి గతంలో కళ్యాణ్ రామ్ తో పెద్ద హిట్ పటాస్ కొట్టడం కూడా కలిసి వచ్చిందంటున్నారు. కళ్యాణ్ రామ్ ఫోన్ చేసి బాలయ్య అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసాడని చెప్తున్నారు. అంటే త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కుతుందేమో..వెయిట్ అండ్ సీ..

English summary
Anil Ravipudi of Patas fame recently met Balakrishna and narrated a storyline which the actor was quite impressed with.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu