»   » హాట్ టాపిక్ :'దిల్' రాజు ఇచ్చిన స్ట్రోక్ కు దిగివచ్చిన హీరో రవితేజ?

హాట్ టాపిక్ :'దిల్' రాజు ఇచ్చిన స్ట్రోక్ కు దిగివచ్చిన హీరో రవితేజ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో ఒకటే టాపిక్ రన్ అవుతోంది. అది మరేదో కాదు..దిల్ రాజు ఇచ్చిన స్ట్ర్రోక్ కు రవితేజ సైలెంట్ అయ్యి దిగి వచ్చాడని. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన యాక్షన్ చిత్రం భధ్రని నిర్మించిన దిల్ రాజు..ఆ మధ్యన రవితేజ డేట్స్ కోసం వెళ్లాడు. అయితే రెమ్యునేషన్ తగ్గించుకోమని దిల్ రాజు అడిగితే, నో చెప్పి ప్రాజెక్టు ప్రక్కన పెట్టేసాడని చెప్పుకున్నారు. ఆ తర్వాత రకరకాల ప్రాజెక్టులు రవితేజతో అనుకున్నా ఏదీ పట్టాలు ఎక్కలేదు. ఏం జరిగిందో ఎవరికీ అర్దం కాలేదు.

కానీ ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం...రెమ్యునేషన్ పెంచాక, సినిమా రిజెక్ట్ చేసాక రవితేజకు దిల్ రాజు చెక్ చెక్ పెట్టాడట. అంతే కాకుండా చిన్న వాగ్వివాదం కూడా జరిగిందిట. ఆ తర్వాత కొన్నాళ్ళపాటు తన ఇన్ఫాలియన్స్ తో రవితేజ పేరు వినిపించకుండా, అతని ప్రాజెక్టు ఏమీ ప్రారంభం కాకుండా చేశాడన్నది చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

Anil Ravipudi to direct Ravi Teja!

దీంతో చేసేది లేక కొంతకాలం విదేశాలకు వెళ్ళి వచ్చి, హైదరాబాద్ రాగానే... మధ్యవర్తులు సాయింతో దిల్ రాజుతో రాజీ చేసుకుని మళ్లీ ఆయనతో ప్రాజెక్టు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది ప్రక్కన పెడితే..మళ్లీ దిల్ రాజు కే రవితేజ సినిమా చేస్తున్నాడనేది మాత్రం నిజం.

'సుప్రీమ్' డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే రవితేజకు ఓ కథ వినిపించాడట. ఆ కథ రవితేజకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట రవితేజ. ఈ సినిమాను దిల్ రాజు తన సొంత బ్యానర్లో నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

English summary
At last, Ravi Teja's film is going to the sets. After sitting idle for more than a year, Ravi Teja has finally okayed director Anil Ravipudi's story that he prepared for NTR. Interestingly, Dil Raju will produce this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu