బాలకృష్ణ, మహేష్.. ఇప్పుడు ఆ హీరోను కూడా లైన్ లో పెట్టిన అనిల్ రావిపూడి

కమర్షియల్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం F3 సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోసారి వెంకటేష్, వరుణ్ తేజ్ తో క్రియేట్ చేస్తున్న ఆ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ గా క్లిక్కయ్యేలా ఉందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇక అనిల్ ఆ సినిమా తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

అసలైతే మహేష్ బాబుతోనే ఒక సినిమాను చేయాలని అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే సూపర్ స్టార్ డేట్స్ అస్సలు ఖాళీగా లేవు. కరోనా వల్ల అనిల్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్సయ్యినట్లే అనే టాక్ వస్తోంది. ఇక మరోవైపు బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నాడు కానీ వర్కౌట్ కావడం లేదు. బాలకృష్ణ కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారు.

Anil ravipudi upcoming movie with sharwanand

ఇక మహేష్ బాబు, బాలకృష్ణతో చేయాల్సిన ప్రాజెక్టులైతే క్యాన్సిల్ అవ్వలేదు గాని ఇప్పట్లో ఉండవని ఒక టాక్ అయితే వస్తోంది. ఇక ప్రస్తుతం అనిల్ ఫోకస్ మరొక హీరోపై పడినట్లు తెలుస్తోంది. క్లాస్ హీరో శర్వానంద్ తో ఒక థ్రిల్లర్ కామెడీ సినిమాను చేయాలని అనుకుంటున్నాడట. తక్కువ బడ్జెట్ లో చాలా తొందరగా ఫినిష్ చేసేలా ఆలోచిస్తున్నారట. ఇక ప్రస్తుతం శర్వానంద్ మహాసముద్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి ఆఫర్ ఇస్తే శర్వానంద్ అంత ఈజీగా మిస్ చేసుకోడని చెప్పవచ్చు. మరి ఈ కాంబో ఫిక్స్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజుకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X