»   » లీగల్ గా ఇరుక్కుని త్రివిక్రమ్ కు తలనొప్పిగా..

లీగల్ గా ఇరుక్కుని త్రివిక్రమ్ కు తలనొప్పిగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ తన టీమ్ లో ఎప్పుడు సంగీత దర్శకుడుని, సినిమాటోగ్రాఫర్ ని కంపర్ట్ గా ఉండేలా చూసుకుంటారు. వారి నుంచి మాగ్జిమం అవుట్ పుట్ తీసుకుని సినిమాని హిట్ కొడుతూంటారు. అయితే ఈ సారి నితిన్ తో చేస్తున్న సినిమాకు తీసుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్ తో సమస్యలు వచ్చి పడ్డాయంటున్నారు.

హీరో శింబుతో పాటు బీప్ సాంగ్ వివాదంలో ఇరుక్కున్న అనిరుధ్...లీగల్ ఇష్యూష్ ఎదుర్కొంటున్నారు. ఆయన వర్క్ చేసే మూడ్ లో లేడని తెలుస్తోంది. ఇప్పటివరకూ నితన్ చిత్రానికి సింగిల్ ట్రాక్ కూడా రికార్డ్ చేయలేదని సమాచారం. సౌండ్ రికార్డింగ్ కూడా ఇప్పటివరకూ స్టార్ట్ చేయలేదని చెప్తున్నారు.

Anirudh give Tough time to Trivikram

మరో ప్రక్క సినిమా షూటింగ్ పూర్తి చేసుకునే దశలో ఉంది. ఈ పాటకి ఆడియోని రెడీ చేసి ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేస్తారు. అయితే టెన్షన్ లో తలనొప్పులతో ఉన్న అనిరుధ్ పై ప్రెజర్ తెచ్చి వర్క్ చేయించినా సరైన అవుట్ పుట్ రాదని నితిన్, త్రివిక్రమ్ భావించారట. మరో ప్రక్క దేవిశ్రీప్రసాద్ ని సీన్ లోకి తెద్దామా అనే ఆలోచనలో సైతం త్రివిక్రమ్ ఉన్నట్లు చెప్పుకుంటన్నారు. మరేమి జరుగుతుందో చూడాలి.

అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయటానికి నిర్ణయించారని సమాచారం. అయితే అందుతున్న సమచారాన్ని బట్టి.... ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాని షూట్ చేసి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Anirudh give Tough time to Trivikram

ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌'తో పేరు సంపాదించింది అనుపమ.

నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇదివరకు 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల్ని నిర్మించాం. మా కలయికలో మూడో చిత్రంగా 'అ ఆ' రూపొందుతోంది. తొలిసారి నితిన్‌ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

ఈ చిత్రం కు సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
With Beep song legal issues Aniruddh is in no mood to work for the movie A Aa.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu