»   » రామ్ చరణ్ వద్దన్న టెక్నీషియన్ కే..నితిన్ సై

రామ్ చరణ్ వద్దన్న టెక్నీషియన్ కే..నితిన్ సై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి మొదట అనిరుధ్ ని సంగీత దర్శకుడుగా అనుకున్నారు. అయితే చివర నిముషంలో తమన్ సీన్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు అనిరిధ్...మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. అదీ నితిన్ ద్వారా. నితిన్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి అనిరుధ్ ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసినట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం పూజ ఆగస్టు 28న జరగనుంది. సమంత ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా చేయనుంది. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. సన్నాఫ్ సత్యమూర్తి నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంతో కొద్దిగా డీలా పడ్డ త్రివిక్రమ్ మరో సారి తన ప్రతిభను చూపటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆయన తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. నితిన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సెప్టెంబర్ లో చిత్రం ప్రారంభమయ్యి...సమ్మర్ కు రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ ..తన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Anirudh for Nithiin,Trivikram film?

గతంలో...

ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో మరో సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్, పూరి ఇద్దరూ కూడా ఖరారు చేసారు. మొన్ననే ఫైనల్ నేరేషన్ విన్నాను. సినిమా ఓ హార్ట్ టచ్చింగ్ పాయింట్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ..జూన్ 15 నుంచి షూటింగ్ అని నితిన్ ఆనందంగా కూడా ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నితిన్ ట్వీట్ చేస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

English summary
Nithiin and director Trivikram are teaming up for a new venture. Anirudh Ravichander has been roped in as the music director of this crazy film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu