»   » శ్రీను వైట్లతో పొసగకే: రామ్ చరణ్ మూవీ నుండి అతను ఔట్

శ్రీను వైట్లతో పొసగకే: రామ్ చరణ్ మూవీ నుండి అతను ఔట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను అనఫీషియల్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ స్వయంగీ అతన్ని తీసుకోవాలని పట్టుబట్టినట్లు కూడా ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నుండి అనిరుధ్ తప్పుకున్నట్లు సమాచారం. దర్వకుడు శ్రీను వైట్లతో కొన్ని క్రియేటివ్ డిస్ట్రబెన్సెస్ కారణంగా అతను తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ను ఫైనల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

సినిమా విషయానికొస్తే...
విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

 Anirudh Out Of Ram Charan-Sreenu Vaitla's Movie

సినిమా ప్రారంభం సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ నేటి నుంచి హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు."నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

English summary
To the shock of everyone, there are many talks making rounds that Anirudh Ravichander has walked out of Ram Charan-Sreenu Vaitla's project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu