పవన్ కాదంటే..సందీప్ కిష్ కు సెట్ అయ్యింది
హైదరాబాద్: అలియాస్ జానకిగా తెరమీదికొచ్చిన అనీషా ఆంబ్రోస్ పవన్ కళ్యాణ్ సరసన...సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఆఫర్ వచ్చింది..కెరీర్ సెటిల్ అయ్యినట్లే అనుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తర్వాత ఆమెను తప్పింది ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. ఆ తర్వాత మరో అవకాశమే లేదు.
అయితే ఇప్పడీ వైజాగ్ బ్యూటీ యువ హీరో సందీప్ కిషన్ చెంతకు చేరిందట. తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన నేరమ్' సినిమాని సందీప్ రీమేక్ చేస్తున్న సంగతి
తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అనీషాను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ఈ అవకాశంతోనైనా సక్సెస్ బాటలోకి వస్తే బాగుండును అని భావిస్తోంది అనీషా.

అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్ కన్నెగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నటుడు సందీప్ తెలిపారు.
ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "123"టైటిల్ తో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











