»   » అంజలికి కారు ఎవరు గిప్ట్ గా ఇచ్చారు? (ఫొటో)

అంజలికి కారు ఎవరు గిప్ట్ గా ఇచ్చారు? (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గీతాంజలి ఆడియో సందర్భంగా... అంజలి తనను తనే గిప్ట్ ఇచ్చుకుంది అని చెప్పుకుంటూ ఓ కారు ని రీసెంట్ గా రచయిత కోన వెంకట్ పోస్ట్ చేసారు. ఆ ఫొటోలో అంజలి కారుతో ఫొటో దిగింది...అంతేకాదు ఆమె ఆ కారులోంచి అందంగా దిగి అందరి నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. దాంతో ఇంతకీ ఆమె సొంతంగా ఆ కారు కొనుక్కుందా లేక ఎవరన్నా గిప్ట్ గా ఇచ్చారా అనే టాపిక్ ఇండస్ట్రీలో మొదలైంది. ఆ గిప్ట్... గీతాంజలి నిర్మాత ఇచ్చారని, చిత్రం చాలా బాగా వచ్చి బిజినెస్ బాగా జరుగుతున్నందుకు గిప్ట్ గా ఈ కారు ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఏదమైనా ఫామ్ లో ఉన్న అంజలి..ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ఒప్పుకోవటం చాలా సాహసమైన వ్యవహారమే. అందుకే ఈ గిప్ట్ తో ఆమెను సత్కరించారని అంటున్నారు.

ప్రపంచంలో భూతాలు, ప్రేతాలు బెస్ట్. మిగిలినవన్ని వేస్ట్ అనుకొనే టైపు మనిషి సైతాన్‌రాజ్. కొరివి దెయ్యాలతో కబుర్లు, పిశాచాలతో పబ్బులు, క్లబ్బులు అంటూ తిరుగుతుంటాడు. అతని పేరు చెబితే దెయ్యాలు కూడా నిదురపోవు. అటువంటి సైతాన్‌రాజ్ ఓ అమ్మాయిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకు గల కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు కోన వెంకట్.

Anjali Herself Buy A BMW Car

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.వి.వి సత్యనారాయణ నిర్మాత. రాజ్‌కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో సైతాన్‌రాజ్‌గా బ్రహ్మానందం కీలక పాత్రను పోషిస్తున్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ... కొందరు పుట్టిన తర్వాత నటులవుతారు.మరికొందరు పుట్టుకతోనే నటులవుతారు. అంజలి రెండో కేటగిరికి చెందుతుంది. ఆమెలో మంచి నటి దాగుంది. ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డి హీరోగా మారడం ఆనందంగా వుంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ అంజలిని దృష్టిలో పెట్టుకొనే ఈ చిత్రకథను తయారుచేశాం. ఆమె అంగీకరించపోతే ఈ సినిమా తెరకెక్కేదికాదు.ఈ నెల 20న ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

అంజలి మాట్లాడుతూ... బ్రహ్మానందంతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని వుంది. సైతాన్‌రాజ్‌గా ఆయన పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పింది. ఈ కార్యక్రమంలోశ్రీనివాసరెడ్డి, కృష్ణభగవాన్, అలీ, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

English summary
Anjali now buy a new BMW car herself, after she was separated with his aunt, she doing own decision in her life, now she was doing geethanjili movie written by kona venkat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu