»   » వరుణ్ సందేశ్, నాని హీరోలుగా చిత్రం డిటేల్స్

వరుణ్ సందేశ్, నాని హీరోలుగా చిత్రం డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న నాని, వరుణ్ సందేశ్ కాంబినేషన్లో రవి ఉప్పలపాటి అనే నూతన నిర్మాత ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఎ.సుశాంత్ రెడ్డి అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్న ఈ చిత్రం యాక్షన్ కామిడీగా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి ఎస్. ధమన్ సంగీతం అందిస్తున్నారు. ఆంధోని ఎడిటింగ్, వెన్నెల కిషోర్ కథ, స్యామ్ దత్ కెమెరా సమకూరుస్తున్నారు. ఇక నిర్మాత రవి ఉప్పలపాటి ఇంతకుముందు నాని హీరోగా చేసిన రైడ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసారు. రైడ్ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ రమేష్ వర్మ దర్శకత్వంలో శ్రీ సాయి గణేష ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించారు.

అలాగే దీనిపై పాటు ఇదే నిర్మాత నిఖిల్ హీరోగా బి.చిన్నికృష్ణ అనే దర్శకుడుని పరిచయం చేస్తూ ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ గౌతం రాజు, ఆర్ట్ నారాయణ రెడ్డి, యాక్షన్ రామ్ లక్ష్మన్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులను పత్రికా ముఖంగా ప్రకటించనున్నారు. వరుణ్ సందేశ్...మరో చరిత్ర ప్లాప్ తర్వాత 'కుదిరితే కప్పు కాఫీ...వీలైతే నాలుగు మాటలు' అనే టైటిల్ తో చిత్రం చేస్తున్నారు. వినాయకుడు దర్శకుడు సాయికిరణ్‌ అడవి నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపుదిద్దుకోబోతోంది. అలాగే వరుణ్ సందేశ్ హ్యాపీ హ్యాపీగా...అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. ఈ చిత్రం ద్వారా ప్రియా శరణ్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. ప్రియాశరణ్ గతంలో ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్దన్(భిళ్లా), ఎమ్.రాజా (హనుమాన్ జంక్షన్)ల వద్ద అసెస్టెంట్ గా పనిచేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu