రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రంపై కొత్త రూమర్
రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన చిత్రం "ఆరెంజ్". ఈ చిత్రంపై ఇప్పటికే ప్రొడక్షన్ కాస్ట్ చేయి దాటిపోయిందని, ముగ్గురు దర్శకులు చేస్తున్నారని రకరకాల వార్తలు వినపడ్డాయి. అయితే కొత్తగా ఈ చిత్రం గురించి మరో రూమర్ మొదలైంది. అది సినిమాలో జెనీలియా, రామ్ చరణ్ జోడీ కుదరలేదని, జెనీలియా బాగా ముదురుగా కనపడిందనీను. అందుకే భాస్కర్ వీరిద్దరిపై డ్యూయిట్స్ తీసే సాహసం చేయలేదని చెప్తున్నారు. అంతేగాక విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్స్ లో కూడా వీరిద్దరి మధ్యన సరైన కెమిస్ట్రీ కనపడలేదని చెప్తున్నారు. అయితే ఇది కావాలని పుట్టించిన రూమరేనని ఈ సినిమా యూనిట్ కి చెందిన వారు కొట్టిపారేస్తున్నారు. బడ్జెట్ ఎక్కువైందనేది నిజమేనని, ఆ విషయం ఆల్రెడీ నిర్మాత నాగబాబు ఒప్పుకున్నాడని, అయితే సినిమా మాత్రం ఖుషీ రేంజిలో మంచి రొమాంటిక్ కామిడిగా వచ్చిందని, హిట్టు గ్యారెంటీ అని చెప్తున్నారు. నాగబాబు కూడా చరణ్ కి, భాస్కర్ కి ఇది మూడో చిత్రం. ఖచ్చితంగా ఇద్దరూ ఆరెంజ్ తో హేట్రిక్ పూర్తి చేస్తారు అంటున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











