»   » 'చంద్రముఖి' సీక్వెల్ లో వెంకీ సరసన ఆమె?

'చంద్రముఖి' సీక్వెల్ లో వెంకీ సరసన ఆమె?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందనున్న 'చంద్రముఖి' సీక్వెల్ లో హీరోయిన్ గా అనూష్కని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ముందుగా సినిమా చూసిన తర్వాతే ఏ విషయం చెప్తానని చెప్పిందట. అందుకే ఆప్తరక్షక చిత్రాన్ని ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసి ఆమెకు చూపెట్టారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చేయమని మొదట రజనీకాంత్ ని కోరారు. కానీ ఆయన రిజెక్టు చేయటంతో వెంకటేష్ చేయటానికి ముందుకొచ్చారు. కన్నడంలో ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ చేసారు.ఆయన చివరి,మరియు 200 వ చిత్రం ఇది. ఇక అనూష్క ప్రస్తుతం మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోంది. అలాగే సముద్ర దర్శకత్వంలో పంచాక్షరి చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu