For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లీకైంది: అనుష్క.... పగలు జర్నలిస్టు, రాత్రి కాల్ గర్ల్

  By Srikanya
  |

  హైదరాబాద్: అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి అనుష్క శర్మ కాల్ గర్ల్ గా ఆమె తాజా చిత్రం పీకే లో కనిపించనుందని తెలుస్తోంది. అమీర్ ఖాన్ ఎలియన్ పాత్రలో కనిపించనున్నాడని చెప్తున్నారు. అనుష్క శర్మ పాత్ర రెండు షేడ్స్ తో నడుస్తుందని, పగలు జర్నలిస్టుగా, రాత్రిళ్లు వేశ్యగా ఉండబోతోందని తెలుస్తోంది.

  ఇక అమీర్ ఖాన్ పాత్ర విషయానికి వస్తే అది బట్టలు ఒంటిమీద ఉంచుకోవటానికి ఇష్టపడని పాత్ర అదని చెప్తున్నారు. ''నవ్వకుండా ప్రేక్షకుల్ని నవ్వించడం కష్టం. ఈ సినిమాలో నేను ఆ పని చేశాను. ఇంతవరకు ఏ సినిమాకూ పడనంత కష్టం ఈ సినిమా కోసం పడ్డాన''న్నారు ఆమీర్‌ ఖాన్‌. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'పీకే'. ఈ నెల 19న విడుదలవుతోంది.

  ఇక 'పీకే' కథేంటి..మిగతా విశేషాలు స్లైడ్ షోలో...

  ఇదే కథ...

  ఇదే కథ...

  బాలివుడ్ లో వినపడుతున్న రూమర్స్ ప్రకారం అమీర్ ఖాన్ పాత్ర... ఎలియన్ అని అది... తన గ్రహం మీద ఉన్న జీవుల్ని రక్షించుకోవటానికి, భూమి మీదకు వచ్చి కొందరు దేముళ్లను ఇక్కడ నుంచి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుందని, ఆ నేపధ్యంలో జరిగే కథనమే ఈ చిత్రం కథ చెప్తున్నారు. ఈ లీకెడ్ ప్లాట్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జోరుగా ప్రయాణం చేస్తోంది.

  పూర్తి వ్యంగ్యం

  పూర్తి వ్యంగ్యం

  ఈ చిత్రం సామాజిక వ్యంగ్య రూపకంగా ఈ చిత్రం ఉండబోతోందని అంటున్నారు. పూర్తి ఫన్ తో రూపొందించారని చెప్తున్నారు. ముఖ్యంగా దేముళ్ళు, మన మూఢ నమ్మకాలుపై అమీర్ వేసే సెటైర్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.

  ఆమీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ....

  ఆమీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ....

  ''వినోదం, సందేశం మేళవించి రాజ్‌కుమార్‌ హిరానీ ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాకు ఆయనే హీరో. ఆయన కథను గొప్పగా రాసుకొచ్చాడు. కథ విన్న వెంటనే అంగీకరించడానికి ఒక్క క్షణం ఆలోచించలేదు అన్నారు.

  భోజపురి నేర్చుకున్నా...

  భోజపురి నేర్చుకున్నా...

  సినిమా కోసం భోజ్‌పురి భాషను నేర్చుకున్నాను. దీనికి నాలుగు నెలలు పట్టింది. ఓ సినిమా కోసం కొత్త భాషను నేర్చకోవడం, ఆ భాషలో మాట్లాడటం కొత్తగా అనిపించింది.

  ట్రాన్సిస్టర్...

  ట్రాన్సిస్టర్...

  అందరూ ఆ ట్రాన్సిస్టర్‌ పోస్టరు గురించి మాట్లాడుతున్నారు. కథలో ఆ సన్నివేశం చాలా కీలకం. అలా నగ్నంగా పట్టాలపై ఎందుకు నిలబడాల్సి వచ్చిందో సినిమా చూస్తే అర్థమవుతుంది.

  అవన్నీ రూమర్స్...

  అవన్నీ రూమర్స్...

  'ఓ మై గాడ్‌'కు ఈ సినిమాకు దగ్గర పోలికలు ఉన్నాయమని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. ఈ సినిమాలో మూఢనమ్మకాలపై చర్చ జరుగుతుంది. అది ఏ మతాన్ని సమర్థించేలా ఉండదు''అన్నారు.

  పొట్టిగా..

  పొట్టిగా..

  అనుష్క శర్మ కన్నా మీరు పొట్టిగా కనిపిస్తున్నారు అని అంటే... ''అనుష్కను నా పక్కన వచ్చి నిల్చోమని చెప్పండి. ఆమెను నిలబెడమనండి నేను తనకన్నా పొడుగు'' అని నిలబడి చూపించారు ఆమీర్‌.

  దక్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ....

  దక్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ....

  ''దక్షిణాది సినిమాల్లో వైవిధ్యం నాకు నచ్చుతుంది. నాకే కాదు అందరికీ ఇక్కడి సినిమాలంటే అందుకే ఇష్టం. నేను చేసిన 'గజని' కథ అలాంటిదే. దక్షిణాదిలో ఎందరో దర్శకులు వచ్చినా రాజమౌళి ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటాయ''న్నారు.

  సమాజం కోసం..

  సమాజం కోసం..

  సినిమా ద్వారా వినోదం మాత్రమే కాకుండా సమాజానికి ఏదైనా మంచి చేయాలని చూస్తుంటాను. దీనికోసం ఆయన సినిమా కాకుండా ఎంచుకున్న మార్గం 'సత్యమేవ జయతే'. సమాజంలోని సమస్యలను తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో తొలి సిరీస్‌ ఇటీవల పూర్తయింది.

  సెకండ్ సీరిస్...

  సెకండ్ సీరిస్...

  రెండో సిరీస్‌ ఎప్పుడా అని అందరూ చూస్తున్నారు. రెండో సిరీస్‌ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉందట. ''సత్యమేవజయతే' తొలి షెడ్యూల్‌ విజయవంతమైంది. ఐదేళ్లపాటు మా బృందం శ్రమించి కార్యక్రమం రూపొందించింది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని మళ్లీ వస్తాను. అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను''అని చెప్పాడు ఆమీర్‌. ఆమీర్‌ సినిమాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

  మనస్సు పడ్డారు కానీ..

  మనస్సు పడ్డారు కానీ..

  రైలుపట్టాలపై నగ్నంగా ట్రాన్సిస్టర్‌ అడ్డుపెట్టుకొని నిలుచున్న ఆమీర్‌ఖాన్‌... 'పీకే' చిత్రంలోని తొలి పోస్టర్‌ ఇది. దీంతోనే పీకేపై అంచనాలు ఓ స్థాయిలో మొదలయ్యాయి. తర్వాత ఒకటొకటిగా పోస్టర్‌లు, ప్రచార చిత్రాలు, పాటలు విడుదలయ్యాయి. వీటన్నింటిలోనూ ఆమీర్‌ఖాన్‌తోపాటు కనిపించే వస్తువు ట్రాన్సిస్టర్‌. ఇది ప్రేక్షకుల దృష్టినే కాదు చిత్రబృందాన్ని ఎంతగానో ఆకర్షించింది. చాలామంది దీనిపై మనసుపడ్డారు.

  హీరోయిన్ అడిగింది కానీ..

  హీరోయిన్ అడిగింది కానీ..

  ట్రాన్సిస్టర్ కావాలంటూ.. చిత్ర హీరోయిన్ అనుష్కశర్మ అయితే ఏకంగా ఓ అడుగు ముందుకేసి ఆ ట్రాన్సిస్టర్‌ నాకు కావాలంటూ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ, ఆమీర్‌ఖాన్‌లను అడిగేసింది. 'నువ్వే కాదు మేమూ మనసుపడ్డాం ఆ ట్రాన్సిస్టర్‌పై' అని చెప్పేశారు.

  ఆన్ లైన్ వేలంలో..

  ఆన్ లైన్ వేలంలో..

  తాజాగా దీనిపై ఆన్‌లైన్‌లో వస్తువులను వేలం వేసే ఓ సంస్థ కన్నుపడింది. ఏకంగా రూ.1.5కోట్లు ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకొచ్చిందని సమాచారం. మహాఅయితే రూ.200-300 మధ్యలో ఉండే ఈ ట్రాన్సిస్టర్‌కు ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్‌ వచ్చినా ఆమీర్‌ఖాన్‌ ససేమీరా అన్నాడట.

  అమీర్ నో చెప్పాడు...

  అమీర్ నో చెప్పాడు...

  'ఈ ట్రాన్సిస్టర్‌ నాకెంతో ప్రియమైంది. దీన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు' అని ఆమీర్‌ఖాన్‌ చెప్పాడట. ''ట్రాన్సిస్టర్‌ కోసం భారీ మొత్తం ఇవ్వడానికి ముందుకొచ్చిన మాట వాస్తవమే''అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం.

  English summary
  Anushka Sharma will be seen as sex worker in most-awaiting film PK, starring Aamir Khan. While Aamir essays the role of an alien, Anushka's role believed to have two shades - journo by day and prostitute by night.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X