»   » హ్యాండిచ్చిన మెగా క్యాంప్‌.. అజ్ఞాతంలో అనుష్క!

హ్యాండిచ్చిన మెగా క్యాంప్‌.. అజ్ఞాతంలో అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anushka Bhagamati Release Postponed, Reason Behind భాగమతి ఎందుకు ఆగిపోయిందో తెలుసా

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు అనుష్కను మెగా క్యాంప్ నిరాశ పరిచిందట. చిరంజీవి సరసన 'సైరా నరసింహారెడ్డి'లో నటించాలని అనుకున్న ఆమె వారు సంప్రదించగానే ఓకే చెప్పాలని అనుకుంటుండగా ఆమె లావుగా ఉండేసరికి ఆమె వద్దనుకుని డ్రాప్‌ అయ్యారని తెలుస్తుంది. దీంతో ఆ అవకాశం నయనతార తలుపు తట్టినట్టు తెలుస్తున్నది.

అవకాశం చేజారిపోతుండడంతో..

అవకాశం చేజారిపోతుండడంతో..

ప్రభాస్‌తో సాహోకి కూడా అనుష్కనే ఫైనలైజ్‌ చేసేద్దామని చిత్రబృందం అనుకుని కూడా అమ్మడు బొద్దుగా ఉందని కాస్త ఎక్కువ డబ్బిచ్చి శ్రద్ధా కపూర్‌ని పెట్టుకున్నారు. దీనికి కూడా అనుష్క ఫిట్‌నెసే కారణమని ఇలా వచ్చిన ప్రతీ అవకాశం చేజారిపోతుండడంతో ఆమె డీలా పడిపోతుందట.

కొంతకాలం కనిపించకుండా

కొంతకాలం కనిపించకుండా

దీంతో బాగా హర్ట్ అయిన అనుష్క బరువు తగ్గడం అనేది సవాల్‌గా తీసుకుని యోగా శిక్షకురాలిగా తన అనుభవాన్ని వాడుకుంటూ, జిమ్‌లో గంటలు కొద్దీ గడుపుతోందట. ఒక పర్సనల్‌ ట్రెయినర్‌ని కూడా పెట్టుకుని బాగా కష్ట్పడి షేప్ అయ్యి ఫిక్స్ అయిందట. అందుకే కొంతకాలం ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిందని తెలుస్తుంది.

భాగమతి కథ ఆధారంగా..

భాగమతి కథ ఆధారంగా..

తాజాగా హైదరబాద్ నవాబు కులీ కుతుబ్ షా ప్రేమించి పెళ్ళాడిన భాగమతి కథ ఆధారంగా తెరకెక్కిన చరిత్రకాత్మక సినిమా "భాగమతి" టైటిల్ రోల్‌లో అనుష్క నటించింది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.

త్వరలోనే భాగమతి విడుదల

త్వరలోనే భాగమతి విడుదల

యూవీ క్రియేషన్స్ సంస్థ "భాగమతి" సినిమాని నిర్మిస్తుండగా "పిల్ల జమీందార్" ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కి త్వరలోనే చిత్రన్ని విడుదల చేసేందుకు చిత్ర‌బృందం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

English summary
After Bahubali, Anushka career riding on rough patch. She is loosing big offers like Saaho, Sye Ra Narsimha Reddy. These reson make Anushka goes underground for fitness. Her movie Bhagmati getting ready for release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu