»   » మరో రెండు నెలల్లో అనుష్క వివాహం..స్పష్టమైన ప్రకటన

మరో రెండు నెలల్లో అనుష్క వివాహం..స్పష్టమైన ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువ దర్శకుడు క్రిష్‌ తోనే అందాల బొమ్మ 'అరుంధతి' వివాహం ఖాయంగా జరుగనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. గత కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగతప్పదు. టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌ గా ఉన్న అనుష్క గతంలో హీరో గోపీచంద్‌ తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత యువ సామ్రాట్ నాగార్జున తనయుడు నాగచైతన్యతో నిశ్చితార్థం అయినట్టు ఇటీవల ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటిని ఇరు వర్గాల వారు ఖండించారు.

అయితే, ఇపుడు తాజాగా మరో కథనం పుట్టుకొచ్చింది. ఈ కథనానికి బలం చేకూర్చేలా అనుష్క-క్రిష్‌లు నడుచుకోవడం గమనార్హం. ఇటీవల తమిళ యువహీరో కార్తీ వివాహ రిసెప్షన్ చెన్నయ్‌ లో జరిగింది. ఇందులో క్రిష్-అనుష్కలు కలిసి జంటగా వచ్చారు. ఇది అక్కడ ఉన్న వారందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాదండీ.. వీరిద్దరు తమతమ ప్రాజెక్టుల గురి ఒకరికొకరు చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారట. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఒక్కింటి వారు కావాలని తహతహలాడుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. గా మరో రెండు నెలల్లో అనుష్క వివాహంపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
South Indian actress Anushka (Anushka Shetty) & Director Krish are believed to be in love, as per telugu film industry sources.There was buzz earlier that Anushka was in love with an actor , but it seems has Anushka has chosen her life partner.Now, news emerging from telugu filmdom is Anushka Shetty & Director Radhakrishnan (Krish) are in love & have decided to marry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu