»   » ‘మహానటి’..... అనుష్కను ఇలాంటి పాత్రలో ఊహించగలమా?

‘మహానటి’..... అనుష్కను ఇలాంటి పాత్రలో ఊహించగలమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కెరీర్లో ఇప్పటి వరకు భిన్నమైన పాత్రలు పోషించిన అనుష్క... త్వరలో ఓ డిఫరెంట్ పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోందట. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కతున్న 'మహానటి'లో అనుష్క జమునగా కనిపించబోతున్నట్లు టాక్.

ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోందని, హీరోయిన్ సమంత జర్నలిస్టుగా కనిపించనుందని అంటున్నారు. సావిత్రికి చాలా సన్నిహితంగా ఉండే జమున పాత్రలో అనుష్క అయితే బాగా సెట్టవుతుందని, అందుకే ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.

Anushka

సావిత్ర భర్త జెమిని గణేశన్ పాత్రను ప్రకాశ్‌రాజ్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కోసం సావిత్రి కాలం నాటి పరిస్థితులకు అద్దంపట్టేలా భారీ సెట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి సినీ పరిశ్రమలో మహానటిగా ఎదిగిన సావిత్రి జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. మహానటిగా వెలుగిన ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆసక్తికరం. జీవితం చివరి రోజుల్లో అత్యంతదారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఇవన్నీ సినిమాలో చూపించబోతున్నారు. జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకాబోతోంది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్. అశ్వీనీదత్ నిర్మాత.

English summary
Tollywood actress Anushka might play veteran Telugu actress Jamuna in the bilingual film Mahanati, a biopic on late actress Savitri. Film Nagae source said that, Anushka was approached for the role but has not yet issued a confirmation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu