»   » చిరంజీవి 150 చిత్రంలో ఆ ఇద్దరు హీరోయిన్స్

చిరంజీవి 150 చిత్రంలో ఆ ఇద్దరు హీరోయిన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన చిరంజీవి అతి త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించడబోయే చిత్రం చిరుకి 150వ చిత్రం కావడం మరో విశేషం. దాంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు, ఎవరు డైరక్ట్ చేస్తారు అన్న విషయాలకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో.'స్టాలిన్‌" చిత్రంలో ఒక్క సాంగ్‌కే పరిమితమైన అనుష్క ఈ చిత్రంలో మాత్రం హీరోయిన్‌గా నటిస్తోందనీ, రెండో హీరోయిన్ ‌గా ప్రియమణి లేదా విమల రామన్‌ పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

ఇక తన 150వ చిత్రం గురించి చిరంజీవి ఇలా చెప్తున్నారు..."ఇంద్ర, స్టాలిన్‌, ఠాగూర్‌ చిత్రాల్లో లాగానే రాబోయే సినిమాలోనూ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, సందేశం, సెంటిమెంట్‌...అన్నీ కలిపే స్క్రిప్టు తయారవుతుంది. సగటు ప్రేక్షకులు నా నుంచి ఏం ఆశిస్తారో అది తప్పకుండా అందిస్తాను. వారి ఆలోచనల్ని, ఎక్సపెక్టేషన్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను" అన్నారు చిరంజీవి. ఈ చిత్రానికి అధినాయుకుడు అనే టైటిల్ ని ఠాగూర్ మధు రిజిస్ట్రేషన్ చేసారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, వివి వినాయిక్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్శ్ స్క్రిప్టు అందించనున్నారని అంతటా వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu