»   » నన్ను క్షమించి వదిలేశారంటూ,మీడియాపై అనుష్క సెటైర్

నన్ను క్షమించి వదిలేశారంటూ,మీడియాపై అనుష్క సెటైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇంతకు ముందుతో పోలిస్తే నాపై కాస్త తక్కువగానే గాసిప్పులు వస్తున్నాయి. నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో..?. లేదంటే నా మనస్తత్వంపై ఇప్పటికే అందరూ ఓ అంచనాకు వచ్చేసి ఉంటారు. అందుకే నా గురించి ఎవరూ రాయడం లేదనుకొంటున్నా అంటూ వ్యంగ్య బాణాలు వదులుతోంది అనుష్క.

అనుష్క మాట్లాడుతూ....''సినీ స్టార్స్, క్రికెటర్లు, రాజకీయ నాయకులు... వీళ్లందరిపైనా గాసిప్పులు వస్తూనే ఉంటాయి. కానీ.. మాపై పుట్టిన వార్తలైతే మరీ వేడిగా ఉంటాయి''అంటోంది అనుష్క. అనుష్క పైనా హాట్‌ హాట్‌ వార్తలు చాలానే పుట్టుకొచ్చాయి.

Anushka Satire on Media?

మరీ ముఖ్యంగా స్వీటీ పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ మీడియాని ఏలాయి. ఓ బిజినెస్ మ్యాన్ ని ఆమె వివాహం చేసుకోబోతోందని, ఎంగేజ్ మెంట్ జరిగిందని, అలాగే ప్రభాస్, ఆర్య, గోపీచంద్ వంటి స్టార్స్ తో ఆమెకు ముడిపెడుతూ రూమర్స్ సైతం వచ్చాయి. ఇప్పుడు వాటి జోరు తగ్గింది అంటోంది అనుష్క.

అనుష్క ఇంకా ఏమంటోందంటే... నాతోటి హీరోయిన్స్ కు ఈ విషయంలో ఇచ్చే సలహా ఒక్కటే. మీపై మీరు నమ్మకం ఉంచుకోండి... ఎవ్వరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులకు తప్ప...'' అంది.

తాను నటించిన 'యముడు 3', 'ఓం నమో వేంకటేశాయ' ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ఈ వేసవికి విడుదల కానుంది. ఈ మూడు చిత్రాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

English summary
Refuting rumours that Anushka Shetty is getting hitched after she finishes working on S.S Rajamouli's Telugu magnum opus Baahubali 2.It was reported that Anushka was set to marry a businessman whom she had met recently. Earlier, online was also abuzz with rumours of the actress getting close with her co-stars Arya and Prabhas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu