twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల ‘కహాని’కి హీరోయిన్ దొరికింది

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం హిందీ రీమేక్ 'కహానీ' ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తైనా హీరోయిన్ సెర్చింగ్ దొరుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మొదటి నుంచీ ఆప్షన్ అనుకుంటున్న అనుష్క ఫైనల్ అయినట్లు సమాచారం. ఆమెని రీసెంట్ గా శేఖర్ కమ్ముల కలిసి కథ చెప్పటం జరిగిందని, ఆమె తను ఆ చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ సమాచారం. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. యండమూరి వీరేంద్రనాధ్ స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్ర కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మార్పులు చేస్తున్నాడు. కనిపించకుండా పోయిన తన భర్తని వెతుక్కుంటూ ఇండియాకొచ్చే యువతిగా ఇందులో అనుష్క నటించనుంది. కొంత సస్పెన్స్‌తో పాటు థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కనున్న ఈ మూవీని ముంబైకి చెందిన టీవీ ప్రొడక్షన్ సంస్థ ఎండిమోల్ ఇండియా-మూవింగ్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నాయి.

    బాలీవుడ్ లో విద్యా బాలన్ నటించిన 'కహానీ' చిత్రం మంచి విజయం సాధించింది . ఈచిత్రంలో విద్యా బాలన్ గర్భవతిగా నటించింది. అయితే తెలుగు వెర్షన్ కు గానూ గర్బవతిగా అనుష్క పాత్రను ఉంచుతారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఒప్పందం ఇటీవలే ముంబైలోకుదిరింది. విద్యాబాలన్ పోషించిన గర్భవతి పాత్రలో తెలుగు ప్రేక్షకులను అనుష్క ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. అనుష్క ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో చారిత్రక చిత్రం 'రువూదమదేవి'లోనూ, ప్రభాస్‌తో 'మిర్చి', సెల్వరాఘవన్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం 'ఇరండం ఉళగం' చిత్రాల్లో నటిస్తోంది.

    ఇక తాను ఈ రీమేక్ చేయటానికి మూడు కారణాలు తెలియచేసారు శేఖర్ కమ్ముల.. 1. నేను మొదటి నుంచి స్త్రీ ప్రధాన పాత్రలో ఉండే చిత్రాలంటేనే ఆసక్తి చూపుతున్నాను. నా చిత్రాలన్ని అదే కోవలో ఉంటాయి. కహానీ కూడా స్త్రీ చుట్టూ తిరగే కథే. 2. కహానీ కథ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో జరుగతుంది. కోలకతా కు హైదరాబాద్ కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి బ్యాక్ గ్రౌండ్,లొకేషన్స్ సమస్య అనిపించదు. 3. థ్రిల్లర్ సబ్జెక్టులంటే నాకు ఇష్టం.

    English summary
    Anushka is likely to reprise the role of Vidya Balan in this 'Kahaani' Telugu remake. Renowned writer Yandamuri Veerendranath is expected to pen the script for this film. More details awaited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X