»   » చంద్రముఖి సీక్వెల్ లో అనూష్క కాదు...మరి

చంద్రముఖి సీక్వెల్ లో అనూష్క కాదు...మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందనున్న 'చంద్రముఖి' సీక్వెల్ లో హీరోయిన్ గా అనూష్కని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె కాకుండా బాలీవుడ్ హీరోయిన్ అనూష్క శర్మను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. షారూఖ్ సరసన రబ్ దే బనాదే జోడి చిత్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ను నిర్మాత బెల్లంకోండ సురేష్ డేట్స్ కోసం సంప్రదించినట్లు సమాచారం. ఇక ఆమె కూడా తెలుగు ఎంట్రీకి సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.ఇక రెమ్యునేషన్ విషయంలోనే బేర సారాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే మరో ట్విస్టు ఏమిటంటే అనూష్క శర్మ వర్కవుట్ కాకపోతే ప్రియమణి ఈ పాత్రను చేసే అవకాశం ఉంది. ప్రియమణి తో బెల్లంకండ ఇంతకు ముందు శంభో శివ శంభో చిత్రం చేసారు. ఇక చంద్రముఖి సీక్వెల్ కన్నడంలో హిట్టయిన ఆప్తరక్షక కు రీమేక్. ఇక ఈ చిత్రంలో చేయమని మొదట రజనీకాంత్ ని కోరారు. కానీ ఆయన రిజెక్టు చేయటంతో వెంకటేష్ చేయటానికి ముందుకొచ్చారు. కన్నడంలో ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ చేసారు.ఆయన చివరి,మరియు 200 వ చిత్రం ఇది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu