»   » ప్రభాస్‌తో పెళ్లి.. అనుష్క మనస్తాపం.. ఏం జరిగిందంటే..

ప్రభాస్‌తో పెళ్లి.. అనుష్క మనస్తాపం.. ఏం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 సినిమాతో 'అమరేంద్ర బాహుబలి' ప్రభాస్, 'దేవసేన' అనుష్క జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకొన్నారు. తెరపైన వారి మధ్య కెమిస్ట్రీ అద్బుతంగా పడింది. అయితే తెరవెనుక కూడా వారి మధ్య అఫైర్ జోరుగా కొనసాగుతున్నాయనే రూమర్లు బాహుబలి2 తర్వాత మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మీడియాలో వస్తున్న రూమర్లను చూసి అనుష్క మనస్తాపానికి గురైనట్టు సమాచారం.

ప్రభాస్‌తో పెళ్లి..

ప్రభాస్‌తో పెళ్లి..

జాతీయ వెబ్ సైట్ ప్రభాస్, అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని కథనాన్ని ప్రచురించింది. మరో వెబ్ సైట్ టాలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాతతో రిలేషన్ కొనసాగిస్తున్నది. అందుకే సినిమాలు ఒప్పుకోవడం తగ్గించుకొంటున్నది అని స్టోరీ రాసింది.

రూమర్లకు చెక్..

రూమర్లకు చెక్..

అయితే మీడియాలో ఈ ఊహాగానాలకు, రూమర్లకు కారణం ఎవరు అని పసిగట్టడంలో అనుష్క సఫలమైంది. ఈ రూమర్ల వెనుక హస్తం ఉన్న తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిని తొలగించింది అని వార్తలు వచ్చాయి.

అనేక కథనాలు..

అనేక కథనాలు..

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రతారగా గుర్తింపు పొందిన అనుష్కపై రూమర్లు, గాసిప్స్ రావడం ఇదేమీ కొత్తకాదు. గతంలో ఆమె పెళ్లిపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఆర్యతో అఫైర్ ఉందని, మరో హీరోతో రిలేషన్ పెట్టుకొన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

పారిశ్రామికవేత్తతో..

పారిశ్రామికవేత్తతో..

మేడమ్ పెళ్లి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో జరుగబోతున్నది అని గతేడాది అనుష్క శెట్టి మేనేజర్ ఓ పత్రికకు వెల్లడించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆ వార్త తప్పని తేలడంతో అనుష్కకు ఉపశమనం కలిగింది.

ఎలా వస్తున్నాయో తెలీదు..

ఎలా వస్తున్నాయో తెలీదు..

తాజాగా వచ్చిన రూమర్లు గాసిప్స్‌పై అనుష్క స్పందించింది. నా పెళ్లిపై రూమర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు అని ఆమె పేర్కొన్నది. పెళ్లి గురించి వస్తున్న వార్తలో వాస్తవం లేదు అని స్పష్టం చేసింది. బాహుబలి2 విడుదల తర్వాత అనుష్క ప్రస్తుతం విహారయాత్ర కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లింది.

మీడియాలో రొటీన్‌గా..

మీడియాలో రొటీన్‌గా..

తనకు ఒకరితో అఫైర్ అంటూ, పెళ్లి అనే వార్తలు మీడియాలో రొటీన్ వ్యవహారంగా మారింది. నేను పనిచేసే ప్రతి స్టార్‌తో అఫైర్ అంటగట్టడం బాధగా ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచురించడం భావ్యం కాదు అని అనుష్క తాజాగా జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

లైట్‌గా తీసుకొంటున్నాను..

లైట్‌గా తీసుకొంటున్నాను..

ఇలాంటి రూమర్లను ప్రస్తుతం చాలా లైట్‌గా తీసుకొంటున్నాను. ఇప్పుడు గాసిప్స్‌ను చూసి బాధపడటం మానేశాను. మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకునే సమయం ప్రస్తుతం నాకు లేదు అని అనుష్క చెప్పింది.

ఫ్యాన్స్ గ్రూప్ జోష్

ఫ్యాన్స్ గ్రూప్ జోష్

అయితే అనుష్క, ప్రభాస్ సన్నిహితంగా కలిసి ఉన్న ఫొటోలను వారి ఫ్యాన్ గ్రూపులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పేర్కొనడం గమనార్హం.

English summary
After the release of Baahubali 2, many stories were written about Anushka Shetty's marriage. The actress was also linked with her co-star Prabhas. Not just that, rumours about her relationship with a producer were also doing the rounds. Now, Anushka has finally found the person, who is leaking all these stories about her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu