»   » ముసలాయనతో లింకేంటని బిత్తర పోయిన అనుష్క!

ముసలాయనతో లింకేంటని బిత్తర పోయిన అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా పరిశ్రమకు చెందిన వారిపై వచ్చినన్ని గాసిప్స్ మరెవరి మీద కూడా రావు. హీరోల కన్న హీరోయిన్స్ పై వచ్చే గాసిప్స్ మరీ ఎక్కువ. పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన కథానాయికల మీద అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. ఆ బెంగతో చాలా మంది మొదట్లో కంట తడిపెట్టి, తరువాత కుళ్ళికుళ్ళి ఏడ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. తర్వాత వారు వాటికీ అలవాటుపడిపోవడం, గాసిప్స్ ను లైట్ గా తీసుకోవడమే కాదు దాన్ని ఎంజాయ్ చేయడం కూడా అలవరుచుకున్నారు.

గాసిప్స్ కూడా ఒక రేంజ్ లో అది కూడా ఆరోగ్యకరమైన పద్దతిలో ఉంటే అందరు హర్షిస్తారు. అయితే రాను రాను గాసిప్స్ అయితే మరి దారుణంగా ఉంటాయి. తాజాగా వచ్చిన గాసిప్స్ అయితే మరి దారుణంగా ఉంది. అనుష్క అయితే ఇలాంటి గాసిప్స్ చూసి నవ్వాలో ఏడవాలో కూడా ఆమెకు అర్ధం కాలేదు. అనుష్క ఫస్ట్ కాసేపు బిత్తర పోయింది. అలాంటి గాసిప్స్ నాగార్జున, గోపిచంద్, ప్రభాస్, జూ ఎన్టీఆర్ లాంటి వారి తో తన పేరు జతకలిపి వచ్చింటే కాసేపు సరదాగా నవ్వుకొని ఉండేది.

అయితే ఆ గాసిప్ వారెవ్వరూ కాకుండా ఆనాటి అగ్రహీరో సరసన తను నటిస్తున్నట్లు రావడంతో అనుష్క షాక్ కు గురైంది. దాదాసాహెబ్ అవార్డ్ గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు సినిమాల్లో నటించడం మానేసి చాలా కాలం అయింది. అలాంటిది ఏ ఎన్ ఆర్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రం నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటేనే అదో ఆసక్తికరమైన విషయం. మరీ అంత బడ్జట్ అంటే ఇంకేమైనా ఉందా అంతే కాదండోయ్ అంతకన్నా మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే అక్కినేని ఆ చిత్రంలో యంగ్ గా చూపించ నున్నారట. దానికోసం గ్రాఫిక్స్ ను వినియోగించనుననారట. కుర్ర ఏఎన్ ఆర్ గా గ్రాఫిక్స్ తో అక్కినేనిని చూపడమే కాదు అతని సరసన అనుష్క హీరోయిన్ గా నటించనున్నదని దీని సారాంశం. ఈ వర్త కాస్త అక్కినేని చెవిన పడడంతో మొదట ఆశ్చర్యపోయినా తర్వాత హాయిగా నవ్వుకున్నారు. అయితే అనుష్క మాత్రం చాలా ఇబ్బందికి గురైనట్లు సమాచారం. అంత పెద్ద ఆయన తో తన పేరు జత చేసి పుట్టించిన గాసిప్స్ కాసేపు అనుష్కకు దిక్కుతోచలేదు. పెద్దాయన ఏమనుకుంటారో? ఆయన వద్దకు వెళితే ఏమంటారో అని పాపం అనుష్క కంగారు పడుతోంది. ఇలాంటి గాసిప్ మాత్రం వద్దు అని అనుకొని ఉంటుంది పాపం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu