For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క నిర్ణయం... ఫ్యాన్స్ భయపడి,వద్దంటున్నారు

  By Srikanya
  |

  హైదరాబాద్: అరుంధతి నుంచి అనుష్క స్టేచర్ మారిపోయింది. దాంతో పాటే ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ నేపధ్యంలో ఆమె మరింత కష్టపడుతూ విభిన్నమైన పాత్రలు ఎంపికచేసుకుంటోంది. అంతేకాదు.. పాత్రల ఎంపికలో తన పంథాను మార్చుకుంటోంది అనుష్క. చారిత్రక చిత్రాలు, అభినయ ప్రధాన పాత్రలవైపు మొగ్గుచూపుతోంది. వైవిధ్యమైన కథాంశాలతో విజయాల్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ నేపద్యంలో అనుష్క సుందరి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సైజ్ జీరో. ఇటీవలే ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది. భారీకాయురాలైన ఓ యువతి ఉన్నతమైన లక్ష్యం కోసం తన శరీర బరువును తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో 100 కేజీల బరువుండే బొద్దుగుమ్మ, జీరోసైజ్ యువతిగా అనుష్క పాత్ర చిత్రణ రెండు భిన్న పార్శాల్లో సాగనుందని తెలిసింది. ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా, సవాలుతో కూడుకొని ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.

  Anushka to turn plump not 100 kgs

  మొదట బొద్దుగుమ్మపై వచ్చే సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాత్రలో సహజత్వం కోసం అనుష్క బరువు పెరిగేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు, కసరత్తుల్ని ప్రారంభించిందట ఈ భామ. ఆహార నియమాల్లో కూడా మార్పులు చేసుకోనున్నట్లు తెలిసింది.

  అంతవరకూ బాగానే ఉంది. హఠాత్తుగా వంద కేజీల బరువు పెరిగి, తగ్గటమంటే మాటలు కాదు..ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి అంటున్నారు ఆమె అభిమానులు. యాభై నుంచి అరవై కేజీలు ఉండే ఈమె ..తన బరువుని వంద దాటిస్తే సమస్యలు ఖచ్చితంగా వస్తాయంటున్నారు. అయితే రోజూ యోగా చేసి,బాడీని స్టిఫ్ గా ఉంచుకునే ఆమెకు ఈ విషయం తెలియదంటారా..

  అనుష్క మాట్లాడుతూ....నా కెరీర్‌లో మరో భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాను. భవిష్యత్‌లో గొప్ప సినిమాలో నటించానని గర్వంగా చెప్పుకునే విధంగా నా క్యారెక్టర్ ఉంటుంది అని తెలిపింది. ఆర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో శృతిహాసన్ కనిపించనుంది.

  అనుష్క సరసన తమిళ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్నారు. ‘వర్ణ' తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా ఇది. శృతి హాసన్ అతిథి పాత్ర ‘సైజ్ జీరో'కు ప్రత్యేక ఆకర్షణ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమాను నిర్మించనున్నారు.

  రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం: నిర్వాషా, కళ: ఆనంద్‌సాయి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం

  English summary
  Anushka Shetty going to put on weight. Especially a news is making rounds that she would have to increase her weight to 100 kgs for a forthcoming film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X