»   » నిర్మాత చేతిలో మోసపోయిన బొమ్మాళి అనుష్క...

నిర్మాత చేతిలో మోసపోయిన బొమ్మాళి అనుష్క...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య అనుష్క తన అందాలతో ఇరగదీసిన చిత్రం వేదం. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నా. కుర్రకారుని మాత్రం ఓ ఊపు ఊపింది అనుష్క. అయితే ఈ చిత్ర నిర్మాతలు మాత్రం అనుష్కకు దెబ్బకొట్టారని ఫిలింనగర్ లో గుసగుసలు. మొదట అనుష్క కు ఈ సినిమాకు రోజుకు 3లక్షల చొప్పున పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారట. 40రోజలు డేట్స్ బుక్ చేసుకున్నారట. అయితే 40రోజులకు కోటి 20 లక్షలు గిట్టుబాటు అవుతుందిలే అనుకుని డేట్స్ ఇచ్చేసిందట అనుష్క. అయితే వేదం సినిమాలో అనుష్కకు సంబంధించిన సన్నివేశాలను కేవలం 19 రోజుల్లోనే పూర్తి చేశారట. అనుష్కకు 57 లక్షలు మాత్రం చేతిలో పెట్టారట. ఈ విధంగా నిర్మాతల చేతిలో అనుష్క మోసపోయినట్టే కదా! ఈ విషయంలో మాత్రం అనుష్క తెగ ఫీలయిపోయిందట. అందుకే ఈ సినిమా ప్రమోషన్ కు అనుష్క ఏమాత్రం సహకరించడం లేదట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu