»   » కుర్రాడు ఇంకో రీమేక్ కమిటయ్యాడు

కుర్రాడు ఇంకో రీమేక్ కమిటయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్నీ మధ్యనే ..మహేష్ బాబు ఒక్కడు చిత్రం రీమేక్(తేవర్) చేసిన అర్జున్ కపూర్(శ్రీదేవి సవతి కొడుకు) ఇప్పుడు మరో సౌత్ రీమేక్ కమిటయ్యాడు. అది మరేదో కాదు..తెలుగు,తమిళ భాషల్లో విజయవంతమైన రంగం చిత్రం అని సమాచారం. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని సెలబ్రెటీ క్రికెట్లీగ్ ఎండీ విష్ణు ఇందూరి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం అర్జున్ కపూర్ కు ఫెరఫెక్ట్ గా సెట్ అవుతుందంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రంగం చిత్రం కథ ..అశ్వద్(జీవా) అనే ఫొటో జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడూ ఎదో ఒక సంచలనం కావాలనుకునే పత్రికలో పనిచేసే అతను తన కథనాలతో సెన్సేషన్ చేస్తూంటాడు. పనిలో పనిగా విరోధాలు తెచ్చుకుంటూంటాడు. అతనితో పాటు పనిచేస్తున్న సరో(పియా బాజ్ పేయి),ప్రియ(కార్తీక)లతో చనువుగా ఉంటూండటంతో ఇద్దరూ ప్రేమలో పడతాడు. అయితే మన హీరో మాత్రం ప్రియ తోనే ప్రేమ కొనసాగిస్తాడు. ఈలోగా..ముఖ్యమంత్రి(ప్రకాష్ రాజ్) సైతం ఓ తప్పు చేయటంతో దాన్ని ప్రూవ్ చేసి జైలుకు పంపుతాడు.

Arjun Kapoor in another south remake

మరో ప్రక్కన వసంత్(అజ్మల్) అనే యూత్ లీడర్ ...యువరాజ్యం అనే పార్టీ పెట్టి ఎలక్షన్స్ లో నిలబడతాడు. అతను చేస్తున్న మంచి పనులను హైలెట్ చేసి అశ్వద్ అతనికి సపోర్ట్ ఇస్తాడు. ప్రజల్లో పలుకుబడి పెంచుకున్న వసంత్...మీటింగ్ లో బాంబు పేలి..ఓ ముప్పై మంది వరకూ కార్యకర్తలు చనిపోతారు. ఆ ప్రమాదంలో సరూ కూడా చనిపోతుంది. ఇది చూసిన జనం సానుభూతితో వసంత్ ని ముఖ్యమంత్రిని చేస్తారు. ఈ లోగా అశ్వద్ కి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి... అసలేం జరిగిందనేది మిగతా కథ.

మీడియా, పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఈ చిత్రం స్క్రీన్ ప్లే హైలెట్ గా రూపొందింది. ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో బాగానే ఆకట్టుకుంది. హిందిలో కూడా మీడియా హవా నడుస్తున్న రోజులు కాబట్టి అక్కడ కూడా బాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

English summary
Arjun Kapoor who scored hit remaking Mahesh Babu's Okkadu as Tevar is now getting ready to remake hit film Rangam. Vishnu Induri MD of Celebrity Cricket League bagged the remake rights of the film.
Please Wait while comments are loading...