Pushpa The Rule: పుష్ప 2లో బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ పవర్‌ఫుల్ రోల్‌ కోసమే

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపకల్పనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూడో చిత్రమే 'పుష్ప: ద రైజ్'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. దీనికి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన రావడంతో పాటు కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను కూడా రాబట్టి సత్తా చాటింది. దీంతో ఈ సినిమా రెండో భాగంపై అందరిలోనూ అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో 'పుష్ప ద రూల్' కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ మొదలు కాకుండానే ఈ మూవీ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఫలానా స్టార్ హీరో కీలక పాత్రను పోషిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

 Arjun Kapoor Key Role in Pushpa The Rule

'పుష్ప ద రూల్' మూవీలో మరో బాలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అతనెవరో కాదు.. హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయిన అర్జున్ కపూర్. అవును.. ఈ బాలీవుడ్ హీరోనే తాజాగా సుకుమార్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో ముంబైకి చెందిన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా డిజైన్ చేశారట. దీనికోసమే అర్జున్ కపూర్‌తో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X