»   » త్రివిక్రమ్‌ 'అ ఆ' : అర్దాంతరంగా ఆర్ట్ డైరక్టర్ మార్పు

త్రివిక్రమ్‌ 'అ ఆ' : అర్దాంతరంగా ఆర్ట్ డైరక్టర్ మార్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం, సీనియర్ ఆర్ట్ డైరక్టర్ రాజీవన్ కు త్రివిక్రమ్ కి మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్ వచ్చాయని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకు విభేధాలు వచ్చాయో తెలియదు కానీ ఆయన సినిమానుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన ప్లేస్ లోకి మరో ఆర్ట్ డైరక్టర్ ఎఎస్ ప్రకాష్ వచ్చి చేరారు. రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా 'అ ఆ' టైటిల్ తో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 'అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి' అనేది ఉపశీర్షిక. సమంత హీరోయిన్. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ప్లానింగ్ ప్రకారమే నితిన్ త్రివిక్రమ్ లు ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో అ..ఆ మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే చిత్రాన్ని వచ్చే జనవరి 16న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి నిర్ణయించామని ప్రకటించారు. అయితే అందుతున్న సమచారాన్ని బట్టి.... ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాని షూట్ చేసి జనవరికల్లా సినిమాని ఫినిష్ చేసి లవర్స్ డే కానుకగా ప్రేమికుల రోజున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

 Art Director replaced by A.S.Prakash in Trivikram's AAa

ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌'తో పేరు సంపాదించింది అనుపమ.

నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇదివరకు 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల్ని నిర్మించాం. మా కలయికలో మూడో చిత్రంగా 'అ ఆ' రూపొందుతోంది. తొలిసారి నితిన్‌ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

ఈ చిత్రం కు సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
Trivikram and Senior Art director Rajeevan are at loggerheads on creative differences in the sets of Nithin's ‘A..Aa’. Now they brought in art director AS Prakash in his place.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu