మహేష్ బాబు మేనల్లుడి సినిమా రద్దయిందా? దిల్ రాజు ఎందుకిలా?
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ దసరా(2018) సందర్భంగా 'అదే నువ్వు అదే నేను' టైటిల్‌తో ఓ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బేనర్లో శశి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ సినిమా లాంచ్ అయింది.
సుధీర్‌బాబు మూవీ 'నన్ను దోచుకుందువటే' ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నభా నటేష్‌ను ఇందులో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అట్టహాసంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీ రద్దయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీపిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

సినిమా రద్దు చేస్తున్నట్లు మహేష్ బాబుకు చెప్పారట
ఈ సినిమాను రద్దు చేస్తున్నట్లు మహేష్ బాబుతో పాటు.... గల్లా అశోక్ తండ్రి, ఎంపీ గల్లా జయదేవ్‌కు సమాచారం అదించారట. దిల్ రాజు చెప్పిన కారణంతో మహేష్ బాబుదో పాటు జయదేవ్ కన్విన్స్ అయినట్లు సమాచారం.

దిల్ రాజు ఎందుకిలా చేశారు?
సినిమా స్క్రిప్టు సంతృప్తికరంగా లేక పోవడం, ఇప్పటి పరిస్థితుల్లో ఆ కథ వర్కౌట్ అయ్యే అవకాశం లేక పోవడం వల్లే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారట. లాంచింగ్ విషయంలో తొందర పడకుండా గల్లా అశోక్‌ను మరో మంచి కథతో లాంచ్ చేస్తే బావుంటుందని మహేష్ బాబు, జయదేవ్‌లను ఒప్పించారట.

దిల్ రాజు జడ్డిమెంటు మీద నమ్మకంతో...
సినిమాను జడ్జ్ చేయడంలో ది బెస్ట్ నిర్మాతగా దిల్ రాజుకు పేరుంది. ఆయన ఏదైనా కథ బాగా కన్విన్స్ అయ్యారంటే అది బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కొడుతుంది. ఒకటి రెండు తప్ప... చాలా విషయాల్లో దిల్ రాజు జడ్జిమెంట్ నిజం అయింది. ఆయపై నమ్మకంతోనే... మహేష్ బాబు, జయదేవ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదే బేనర్లో ఉంటుందా?
గల్లా అశోక్ తన బేనర్ ద్వారా లాంచ్ అవుతున్నట్లు ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అయింది కాబట్టి... త్వరలో మరో స్క్రిప్టుతో, మరో దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తారా? లేక ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











