»   » జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో డబుల్ గేమ్ ఆడుతున్న అగ్ర దర్శకుడు!

జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో డబుల్ గేమ్ ఆడుతున్న అగ్ర దర్శకుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్స్ వారసులని తమ బేనర్ ద్వారా ఇంట్రడ్యూస్ చెయ్యాలని తెగ తాపత్రయపడే అశ్వనీదత్ ఆ తొలి చిత్రం చేస్తున్నప్పుడే సదురు హీరోలని కాకా పట్టేసి ప్రతి యేటా తనకో సినిమా చేసి పెట్టాలని ప్రపోజల్ పెట్టేస్తాడు. అందుకే మహేష్, ఎన్టీఆర్ లకీ దత్ బేనర్ లో రెగ్యులర్ గా సినిమాలు చెయ్యాల్సి వస్తోంది.

అలాగే చిరు తనయుడు చరణ్ దగ్గర కూడా 'చిరుత" టైమ్ లో కమిట్ మెంట్ తీసేసుకున్నాడు దత్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చరణ్ ల దగ్గర దత్ ప్లే చేస్తోన్న డబుల్ గేమ్ ఏంటంటే..చరణ్ తో 'జగదేవీరుడు అతికలోకసుందరి"కి సీక్వెల్ చేద్దామని అడిగిన అశ్వనీదత్ కి చరణ్ డేట్స్ ఇమ్మీడియట్ గా లేకపోవడం..కంత్రీ పూరైన వెంటనే మరో సినిమాకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ లభించడంతో 'శక్తి" స్టార్ట్ చేశాడు. సూపర్ నేచురల్ పవర్స్ కలిగుండే హీరో క్యారెక్టరైజేషన్ తో సోషియో ఫాంటసీ చిత్రంగా 'శక్తి"ని రూపొందిస్తూ..ఇది తమ వైజయంతీ బేనర్ లో మరో 'జగదేకవీరుడు అతిలోకసుందరి" అవుతుందటూ ఇండస్ట్రీలో చెప్పుకున్నాడు.

అయితే చరణ్ తో చేద్దామనుకున్న కథనే ఎన్టీఆర్ తో చేసేస్తున్నాడని అంతటా ఊహాగానాలు మొదలవడంతో కంగారు పుట్టింది అశ్వనీదత్ కి. ఈ రోజు చేతిలో వున్న హీరోకంటే రేపుసినిమా చేయ్యాల్సిన హీరోని మచ్చిక చేసుకోవడం ముఖ్యం కనుక హడావిడిగా 'చరణ్ తో 'జగదేకవీరుడు అతిలోకసుందరి" 2011లో వుంటుందనీ, కథ సిద్దమవుతోందనీ, పత్రికలకి ప్రెస్ నోట్ పంపించేశాడు. అయితే అది సెట్స్ పైకి వచ్చిదెప్పుడో , దత్ కి డేట్స్ ఎప్పుడు ఇస్తాడనేది చరణ్ కే తెలియదు. ఆ హీరోకి ఏ డైరెక్టర్ ని సెట్ చేస్తే సినిమా టేకాఫ్ తీసుకుంటుందో ఇంకా దత్ కే తెలియదు. బట్ ఏ హీరోనీ వదులుకోలేడు కనుకే ఇలా స్టేట్ మెంట్స్ తో డబుల్ గేమ్ ఆడుతున్నాడు అశ్వనీదత్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu