»   » మెగా ప్రాజెక్టు 'ఆది శంకరా చార్య' నిర్మించేది ఆయనా?

మెగా ప్రాజెక్టు 'ఆది శంకరా చార్య' నిర్మించేది ఆయనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీరామదాసు, అన్నమయ్య, పాండురంగడు వంటి భక్తి రస చిత్రాలకు రచన చేసిన జె.కె భారవి గత కొంత కాలంగా 'ఆది శంకరా చార్య' ప్రాజెక్టుని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్టు వర్క్, పాటలు పూర్తయినా ఈ చిత్రం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కే పరిస్ధితి కనపడుతోందంటున్నారు ఆయన సన్నిహితులు. రీసెంట్ గా శక్తి షూటింగ్ కోసం హంపి వెళ్లినప్పుడు అశ్వనీదత్ ఈ చిత్రం స్క్రిప్ట్ వినటం జరిగిందని, ఈ మెగా ప్రాజెక్టుని ఆయనే భుజాన ఎత్తుకునే సామర్ధం ఉందని భారవి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక పాటలు విన్న అశ్వనీదత్ త్వరలోనే దీనిపై సిట్టింగ్ వేద్దామని హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు కె రాఘవేంద్రరావు అయ్యే అవకాశం ఉంది. మొదటి భారవి స్వీయ దర్శకత్వంలో చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టు చేయటమంటూ జరిగితే రాఘవేంద్రరావుకే అప్పచెప్తారని అంటున్నారు. ఇక భారవి..శక్తి చిత్రం స్క్రిప్టు వర్క్ లో పాల్గొంటున్నారు. యండమూరి, సత్యానంద్ కూడా ఈ స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ ఈ చిత్రం రూపొందిస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో కంత్రి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu