»   » టాప్ హీరోయిన్ తెలుగులో రీ ఎంట్రీ

టాప్ హీరోయిన్ తెలుగులో రీ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Asin
హైదరాబాద్ : తెలుగు సినిమాలలో టాప్ హీరోయిన్ గా వెలిగి,బాలీవుడ్ కి వలసి వెళ్లిపోయిన హీరోయిన్ అసిన్. అయితే అక్కడ సల్మాన్ వంటి స్టార్స్ తో చేసినా ఆమెకు కెరీర్ టర్న్ కాలేదు. ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడలేదు. అక్కడ పోటీని తట్టుకునే ప్రాసెస్ లో టైమ్ గడిచిపోతోంది కానీ ఆమె కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది. ఈ నేపధ్యంలో ఆమె తనను ఆదరించిన తెలుగు పరిశ్రమకు తిరిగి రావాలని ఆలోచిస్తున్నట్లు...తనకు పరిచయమున్న తెలుగు దర్శక,నిర్మాతలతో టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తెలుగులో వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలకు ..హీరోయిన్స్ కరువు ఉంది. ఆ ప్లేస్ ని అసిన్ భర్తి చేసే అవకాసముందని భావిస్తున్నారు. రీసెంట్ గా వెంకటేష్ ఓ మల్టి స్టారర్ చిత్రం చేద్దామనుకుంటే హీరోయిన్ సమస్య వచ్చి పడింది. నాగార్జున, బాలకృష్ణకు సైతం గత కొంత కాలంగా అదే సమస్య వస్తోంది. మరి అసిన్ వచ్చి రీజనబుల్ ప్రైస్ తో ఉంటే త్వరలోనే ఇక్కడ బిజీ కావచ్చు అంటున్నారు.


'అమ్మా....నాన్న తమిళ అమ్మాయి', 'లక్ష్మీ నరసింహా', 'గజిని', 'శివమణి' వంటి వరుస హిట్స్ తో తమిళ,తెలుగు భాషల్లో లో చక్కటి పేరు తెచ్చుకున్న మళయాళి కుట్టి అసిన్‌. కొంత కాలంగా బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఇక్కడి వారికి దూరమైనా అమ్మడు మళ్లీ సౌత్ పై దృష్టి పెట్టింది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలోని 'దశావతారం'లో కమల్‌కు జంటగా నటించిన ఈ భామ మళ్లీ విశ్వనటుడి సరసన కనిపించనుంది. రమేష్‌ అరవింద్‌ దర్శకుడు. 'ఉత్తమవిల్లన్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

'గజిని' రీమేక్‌తో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్‌, కోలీవుడ్‌లవైపు చూడటమే మరిచిపోయింది. హిందీలోనూ అవకాశాలను అందిపుచ్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం. అంతేగాక తాజాగా ఓ హిందీ సినిమా అవకాశం అసిన్‌ నుంచి శ్రుతికి వెళ్లిపోవటంతో మరింత ఆవేదనకు గురైనట్లు సమాచారం. అయితే...కూతురు దెబ్బ కొట్టినా తండ్రి కమల్ తన సరసన ఆఫర్ ఇచ్చి ఆదుకున్నాడు. కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి 'ఉత్తమ విలన్' అనే టైటిల్ ఖరారు చేసారు. కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా దర్శకుడు లింగుస్వామి ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి ఉత్తమ విలన్ అనే పేరును పెట్టినట్లు తెలిసింది. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.

English summary
Reports from Mumbai reveal Asin is planning to come back to south since north is not working much for her. At a time when Asin was being given all chances to rule the south, she shunned it stating she deserves only Bollywood’s number one position.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu